India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బిటెక్ EEE/ డిప్లమాEEE పూర్తిచేసిన అభ్యర్థుల అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 18.

జల్లుకట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన యాదమరిలో చోటుచేసుకుంది. కొట్టాలలో మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరలో జల్లికట్టు నిర్వహించారు. దీనికి తమిళనాడు సరిహద్దు పరిసర ప్రాంతాల, మండలంలోని ఎద్దులు అధిక సంఖ్యలో వచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగారుపాళెంకు చెందిన దిలీప్‌కుమార్(40)పైకి దూసుకెళ్లింది. ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు.

చిత్తూరు నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కరూర్ వైశ్య బ్యాంకు, ఎన్ఎస్ ఇన్స్ట్రూమెంట్స్ కంపెనీలలో పలు పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో ఈ ఏడాది మే నెలలో బీటెక్ (B.Tech) ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు మహిళ యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో పారామెడికల్ DANS/DLMT కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మెరిట్ లిస్ట్‌ను https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ పొందవచ్చని సూచించారు.

చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించేందుకు ఇద్దరు మంత్రులను కేటాయిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాకు మంత్రి సత్య కుమార్ యాదవ్, తిరుపతి జిల్లాకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కేటాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

పేకాట స్థావరంపై దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేసినట్లు గుర్రంకొండ ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని కుమ్మరపల్లె సమీప అడవిలో నేడు పెద్దఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో దాడులు చేసి నిందితులతో పాటు రూ.41,600 నగదు, 20బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సీఎం చంద్రబాబు ఈనెల 19న శ్రీసిటీకి రానున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ ఎన్.యువరాజ్, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (RARS)లో 12వ తేదీన వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. JRF, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు తెలియజేశారు. డిప్లమా ఇన్ అగ్రికల్చర్, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ నెట్ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

టీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. సుమారు 50 మంది ఇంజనీరింగ్, ఇతర శాఖల ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఇది ఉద్యోగస్తులను బెదిరించడమేనని వెల్లడించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, కూటమి నాయకులు వేధింపులు మానుకోకపోతే పార్లమెంటుకు దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
Sorry, no posts matched your criteria.