India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఇటీవల పుంగనూరులో జరిగిన టీడీపీ శ్రేణుల దాడిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం శాఖ ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిరంతరం ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఉండబోతుంది.

తిరుమలలోని ఓ మఠంలో రెండో వివాహానికి హైదరాబాద్ వాసి రాకేశ్ సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకుని మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చింది. మొదటి భార్యను చూసి కళ్యాణ మండపం నుంచి రాకేశ్ అక్కడ నుంచి పరారయ్యాడు. సంధ్య తిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంధ్య మాట్లాడుతూ.. ‘మాకు ఏడేళ్ల పాప ఉందని, మా మధ్య వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోంది’ అని అన్నారు.

పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై గురువారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదిగబండ సమీపంలోని తన క్వారీలో ఈనెల 6వ తేదీ రాత్రి మూడు టిప్పర్లు, రెండు హిటాచీలు, ఒక ఎక్స్కవేటర్‌ను మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తీసుకెళ్లిపోయారంటూ జనార్దన నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వెంకటేగౌడపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లింట విషాదం చోటుచేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. శాంతిపురం(M), సంతూరు గ్రామానికి చెందిన నవీన్‌కి కర్ణాటక రాష్ట్రం బైనహళ్లికి చెందిన నిఖితశ్రీతో వరుడి సోదరి గ్రామం చందరసనహళ్లిలో వివాహమైంది. ఆ తర్వాత నవదంపతులు ఓ గదిలోకి వెళ్లారు. గంట వ్యవధిలోనే వారి మధ్య ఏం జరిగిందో కానీ కొడవలి దాడిలో వధువు నిఖితశ్రీ మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరుడు నవీన్(30) చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బసచేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేకం సేవలో దర్శించుకోనున్నారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బసచేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేకం సేవలో దర్శించుకోనున్నారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేంద్ర హోం శాఖ CRPF భద్రత కల్పించినట్టు సమాచారం. ఇటీవల పుంగనూరులో అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల నుంచి హాని ఉందని.. భద్రత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి చేరుకున్నారు. నిండ్ర మండలం జీఎన్ కండ్రిగ, వైఎన్ కండ్రిగ గ్రామాల్లో గురువారం పర్యటించారు. వైఎన్ కండ్రిగకు చెందిన వైసీపీ కార్యకర్త పవన్ అనారోగ్యంతో చికిత్స పొందగా ఆయనను రోజా పరామర్శించారు. అనంతరం GNకండ్రిగకు చెందిన కోనమ్మ మృతిచెందగా వారి కుటుంబాన్ని ఓదార్చారు. కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయంలో రోజా విదేశాల్లో ఉన్నారంటూ ఓ ఫొటో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే.

పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధిపొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు. 5 శాతం వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్ అందిస్తారని చెప్పారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తుల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. భాను ప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్ తదితరులు శ్రీకాళహస్తీశ్వర స్వామి శేష వస్త్రంతో సన్మానించి.. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, పుల్లయ్య నాయుడు, హరీష్, భరత్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.