India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రజల్లోకి రాలేదు. ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. తర్వాత జగన్‌తో జరిగిన సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రం హోస్‌కోటలో రామకుప్పం జడ్పీటీసీ సభ్యుడు నితిన్ రెడ్డి వివాహం జరిగింది. పెద్దిరెడ్డితో పాటు పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు ZP ఛైర్మన్ శ్రీనివాసులు ఇందులో పాల్గొన్నారు.
ఇసుక, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని సెబ్ అధికారులకు తిరుపతి ఎస్పీ విష్ణువర్ధన్ రాజు సూచించారు. జిల్లా సెబ్ అధికారులతో పోలీసు గెస్ట్ హౌస్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరూ పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచి ఎక్కడికక్కడ కట్టడి చేయాలన్నారు.
కుప్పం సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘కుప్పానికి రూ.100 కోట్లు కావాలని ప్రజలు కోరుతున్నారు. వంద కాదు.. ఎంతైనా ఇస్తా. కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తా. రూ.10 కోట్ల చొప్పున కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలకు రూ.40 కోట్లు ఇస్తా. మేజర్ పంచాయతీలకు రూ.2 కోట్లు, మైనర్ పంచాయతీకి రూ.కోటి కేటాయిస్తాం. కుప్పం మున్సిపాల్టీని రోల్ మోడల్‌గా మారుస్తా’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో కొత్తగా 2 మండలాల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కుప్పం నియోజకవర్గంలో మల్లనూరు, రాళ్లబూదగూరును మండలాలు చేయాలని కోరారు. నిన్ననే వీటి మీద ఆదేశాలు ఇచ్చా. ఇక కుప్పంలో 6 మండలాలు, ఓ మున్సిపాల్టీ ఉంటుంది. కుప్పం డిపో బస్సులను కూడా దొంగలించారు. వాటిని వెనక్కి తీసుకొచ్చాం. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను కుప్పం డిపోకు ఇస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.
కుప్పంలో చంద్రబాబు బహిరంగ సమావేశం ప్రారంభం కాగానే వర్షం మొదలైంది. దీంతో సమావేశం కొనసాగిద్దామా? కాసేపు ఆపుదామా అని సీఎం కోరగా.. కొనసాగించాలని కార్యకర్తలు కోరారు. ‘కుప్పం దేవుళ్లను నేరుగా చూడటానికి ఇక్కడికి వచ్చా. కుప్పంలో నా సామాజికవర్గ ప్రజలు లేరు. 40 ఏళ్లుగా గెలిపిస్తున్న ఈ వెనుకబడ్డ ప్రజలే నా సామాజికవర్గం. మరోసారి కుప్పం బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు అన్నారు.
మద్యం మత్తులో ఒకరిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడైన మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు అలిపిరి సీఐ రామారావు పేర్కొన్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామానికి చెందిన ప్రసాద్ ఈనెల 14న ఆటోనగర్ చైతన్యపురం వద్ద హత్యకు గురయ్యారు.
సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1478 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో SGTకి 946 పోస్టులు కేటాయించారు. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!
మద్యం మత్తులో ఒకరిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడైన మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు అలిపిరి సీఐ రామారావు పేర్కొన్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామానికి చెందిన ప్రసాద్ ఈనెల 14న ఆటోనగర్ చైతన్యపురం వద్ద హత్యకు గురయ్యారు.
పెద్దపంజాణి మండలం ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో ‘వృషభ’ సినిమా షూటింగ్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. చిత్రంలో నటించిన పలువురు జూనియర్, సీనియర్ నటులను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. కాగా పలమనేరు నియోజకవర్గంలో గత కొన్నిరోజుల నుంచి వరుస షూటింగ్లు జరుగుతుండడంతో సందడి నెలకొంది. నిర్మాత ఉమాశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. పలమనేరులో లొకేషన్స్ బాగుంటాయని కితాబు ఇచ్చారు.
వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం సినీనటి శ్రీలీల సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జీఎంఆర్ అతిథి భవనానికి వచ్చారు. రాత్రికి ఇక్కడే బస చేసి మంగళవారం వేకువజామున అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.