India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం రవాణా, అక్రమ విక్రయాలను అడ్డుకుని ఎక్సైజ్ కేసులు తగ్గించడానికి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారిణి షేక్ ఆయేషా బేగం తెలిపారు. సీఐ సుధాకర్ 95736 32427, కానిస్టేబుల్ కుమార్ జాన్సన్ 89191 60437, జూనియర్ సహాయకులు శ్రీనివాస యాదవ్ 93986 74616లు అందుబాటులో ఉంటారన్నారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
సామాజిక పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈక్రమంలో నగదును డ్రా చేసుకునేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బ్యాంకులతో పాటు బ్యాంకు సేవా కేంద్రాలు, మినీ ఏటీఎంల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. మరోవైపు దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో 9 మంది బీసీవై నాయకులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గత సోమవారం ఎర్రాతివారిపల్లెలో అనుమతి లేకుండానే బీసీవై నాయకులు ప్రచారానికి వెళ్లడంతో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది బీసీవై నాయకులు, అలాగే 9 మంది వైసీపీ నాయకులకు రిమాండ్ విధించగా.. వారిని చిత్తూరు జైలుకు తరలించారు.
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మూడో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు 20వ తేదీలోగా సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకోవాలని.. వివరాలకు 9490957021లో సంప్రదించాలని కోరారు.
నగరి నియోజకవర్గం వడమాలపేట ZPTC మురళి రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అదడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అతనిపై అభియోగాలు వాస్తవమని క్రమశిక్షణ కమిటీ ధ్రువీకరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ ఇంటిపై అర్థరాత్రి దాడికి పాల్పడ్డ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సూర్యనారాయణ కథనం మేరకు.. బి.కొత్తకోటలో కాపురం ఉంటున్న జడ్జి రామకృష్ణ ఇంటిపై మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం వచ్చి ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ద్వంసం చేశాన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అనంతరం జడ్జి ఇంటిపై దాడిచేసింది తమ్ముడు రామచంద్ర అన్నారు
ఎన్నికల విధులు కేటాయించబడిన పిఓ, ఎపీఓలకు రెండవ విడత శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నుండి ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పీ.ఓ, ఎపీఓలకు పక్కాగా శిక్షణ నిర్వహణ ఉండాలని సూచించారు.
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన రమేశ్(40) గంగజాతర సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం బోయకొండ రోడ్డులో ఉన్న సిద్ధప్ప బావి వద్ద ఈతకు వెళ్లినట్లు మృతి చెందాడు. సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశామని అన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచాయి. ఈక్రమంలో నడవలేని వారికి ఇంటి వద్దే పింఛన్ డబ్బులు అందజేశారు. ఆధార్ కార్డు లింకు అయిన బ్యాంకు ఖాతాల్లో మరికొందరికి నగదు జమ చేశారు. ఆ డబ్బులు తీసుకోవడానికి వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమం మే 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుంచి10 గంటల వరకు తిరుపతి టీటీడీ పరిపాలన భవంలోని మీటింగ్ హాల్‌లో జరుగనుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా తెలపవచ్చు అన్నారు.
Sorry, no posts matched your criteria.