Chittoor

News August 6, 2024

చిత్తూరు: అగస్తీశ్వరాలయంలో విచారణ

image

చిత్తూరు నగరంలోని అగస్తీశ్వర ఆలయంలో గత నెల 20 వ తేదీ పూజా సామాగ్రి దొంగతనంపై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసన్నలక్ష్మి విచారణ నిర్వహించారు. దొంగతనం ఘటనపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు గ్రీవెన్స్ లో జేసీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమనప్రియ, VHP సభ్యులు రామ్ భద్ర, చిట్టిబాబు, రామ్మూర్తి, తోటపాళ్యం వెంకటేష్ , సిద్దు తదితరులు పాల్గొన్నారు.

News August 6, 2024

ప్రైవేటీకరణ జాబితాలో తిరుపతి విమానాశ్రయం

image

కేంద్రం రూపొందించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌లో దేశవ్యాప్తంగా చేర్చిన 25 విమానాశ్రయాల్లో తిరుపతి ఉన్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ తెలిపారు. అత్యుత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకోవడానికే లీజుకు ఇస్తున్నామన్నారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని AAI దేశంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు.

News August 6, 2024

తిరుపతి: బాలుడి మిస్సింగ్.. సేఫ్

image

హైదరాబాద్ మీర్‌పేట‌లో తప్పిపోయిన బాలుడు మహీధర్ రెడ్డి(13) ఆచూకీ లభ్యమైంది. బాలుడు తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. పేరెంట్స్ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించారు. మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో దొరికిన ఫుటేజ్ ద్వారా బాలుడి ఆచూకీ కనుగొన్నారు.

News August 6, 2024

పుంగనూరు: డెంగ్యూతో విద్యార్థిని మృతి

image

డెంగ్యూతో ఏడో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన పుంగనూరులో సోమవారం చోటుచేసుకుంది. సోమల మండలం నంజంపేట పంచాయతీ ఇర్లపేటకు చెందిన వెంకటరమణ, ఈశ్వరమ్మ దంపతుల కుమార్తె పూర్ణిమ (11) పట్టణ పరిధిలోని మేలుపట్ల గిరిజన వసతిగృహంలో ఏడో తరగతి చదువుతోంది. తీవ్ర జ్వరం రావడంతో జులై 27న ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చికిత్స చేయించినా తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.

News August 6, 2024

చిత్తూరు: ఎన్ఎంఎంఎస్‌కు దరఖాస్తు చేసుకోండి

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో దేవరాజు తెలిపారు. పరీక్ష రాసేందుకు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోగా ఉండాలన్నారు. పరీక్ష డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు చెప్పారు.

News August 6, 2024

తిరుపతి: 108లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

108లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఏఈఎంఎస్ శ్రీనివాసులు తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఎంఎలీ, బి.ఫార్మసీ, డీఎంఎల్ పూర్తి చేసి ఉండాలని, పైలట్ కి పదో తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News August 6, 2024

చిత్తూరు: కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన

image

సంతపేట PNC మున్సిపల్ స్కూల్ క్రీడా మైదానంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటుకు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ త్రిసభ్య కమిటీ, MEO సెల్వరాజ్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కమిటీ సభ్యులు ఆర్డీవో చిన్నయ్య మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణుడు, తహశీల్దార్ కళావతి, హైస్కూల్ హెచ్ఎం వేద కుమారి పాల్గొన్నారు.

News August 5, 2024

SVU : PG ఫలితాలు విడుదల

image

తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది (PG) M.A, M.Sc 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 5, 2024

గురుకులాల్లో ఉద్యోగాలు.. నేడే చివరి అవకాశం

image

జిల్లాలోని 7 అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO T.పద్మజ తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు అర్హులైన వారు గురుకుల పాఠశాలలో దరఖాస్తులను అందజేయాలన్నారు. B.Edతో పాటు TET అర్హత సాధించిన వాళ్లు అర్హులు. ఈనెల 6న చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు డెమో క్లాసు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News August 5, 2024

పెద్దపంజాని: రోడ్డు ప్రమాదంలో MCA విద్యార్థి మృతి

image

పెద్దపంజాని మండలం బసవరాజుకండ్రిగ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన MCA విద్యార్థి సాయి కిరణ్ (23) బైక్‌పై  వెళుతుండగా పలమనేరు-పుంగనూరు జాతీయ రహదారి వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో సాయికిరణ్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.