India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

CM, Dy.CM కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సైదిరెడ్డి ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 19న చంద్రబాబు, పవన్ కుటుంబసభ్యుల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. కార్వేటినగరానికి చెందిన టీడీపీ నేత సంధాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు సైదిరెడ్డిని కార్వేటినగరం CI హనుమంతప్ప అరెస్ట్ చేశారు.

మదనపల్లె పూర్వ RDO MS మురళి భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు మురళి కూడబెట్టిన ఆస్తులపై శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. కిలో బంగారు ఆభరణాలు, 800 గ్రా. వెండి, ఏడు ఇళ్లు, ఒక హోటల్, 12 స్థలాలు, 20 బ్యాంకు ఖాతాలు, 8 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.230 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయనను ఆదివారం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.

తిరుపతి జిల్లాలో <<14578425>>దొంగనోట్ల <<>>ముఠా పట్టుబడిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మునికృష్ణారావుకు తిరుపతికి చెందిన రమేశ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యారు. చెర్లోపల్లి సర్కిల్ వద్ద ఉన్న రమేశ్ ఇంట్లో ఉంటూ షేర్ మార్కెట్ బిజినెస్ చేయగా నష్టపోయారు. దీంతో యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తిలో ఈ దందా నడిపారు. చివరకు పోలీసులకు చిక్కారు.

కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండపైకి సోమవారం 2 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మదనపల్లె-1 డిపో మేనేజర్ మూరె వెంకటరమణ రెడ్డి తెలిపారు. మదనపల్లె బస్టాండు నుంచి ఉదయం 5 గంటలకు మొదటి బస్సు, 6:30కి రెండో బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ప్రయాణికులు, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ నెల 18వ తేదీన టీటీడీ నూతన పాలకమండలి సమావేశం జరగనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10.15 గంటలకు సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడాక తొలి బోర్డు సమావేశం జరగబోతోంది.

టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులు.. వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలపై చర్చలు జరిగాయి.

కె.వి.పల్లి మండలం APSWR పాఠశాలలో ఇవాళ ఉదయం విద్యార్థి రెడ్డి మోక్షిత్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థి హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకోగా తోటి విద్యార్థులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మోక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. దర్యాప్తు చేస్తున్నామన్నారు.

➤ కూనాటి సురేశ్(ఊరందూరు, జాతీయ అవార్డు)
➤ కె.శ్రీధర్ బాబు(హెచ్ఎం, మేలుమాయి)
➤ బి.సురేంద్రబాబు(కాణిపాకం జడ్పీ స్కూల్)
➤ కె.బాలసుబ్రహ్మణ్యం(దిగువసాంబయ్యపాలెం)
➤ టి.ఆనంద్(పల్లాం)
➤ డా.పి.ప్రభాకర్ రావు(ఎ.రంగంపేట)
➤ ఎం.సుబ్రహ్మణ్యం(బండారుపల్లి)
➤ వి.కామాక్షయ్య(రాజానగరం)
➤ వి.అనిత(కలకడ కేజీబీవీ ప్రిన్సిపల్)
➤ నాగరత్నమ్మ(పెద్దమండ్యం కేజీబీవీ)
➤ బి.మంజువాణి(కేవీబీపురం కేజీబీవీ)

చిరుత దాడిలో మరో ఆవు మృతి చెందినట్లు చౌడేపల్లి మండలంలోని రైతులు చెబుతున్నాడు. బాధిత రైతు కథనం మేరకు.. నాగిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డికి ఆవులు ఉన్నాయి. వాటిని సమీపంలోని కందూరు అడవిలోకి మేత కోసం తరలించారు. సాయంత్రం పశువులన్నీ ఇంటికి చేరుకోగా ఒక ఆవు కనిపించలేదు. రైతు గాలింపు చేపట్టగా శనివారం చనిపోయి కనిపించింది. దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సి ఉంది.

కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. శనివారం హౌసింగ్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీ మోహన్ లతో కలసి మంత్రి పాల్గొన్నారు. హౌసింగ్ కాలనీలో ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు.
Sorry, no posts matched your criteria.