India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో ప్రాక్ శాస్త్రి (Praak Shastri) కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ కోర్సుకు ఎంపికైన వారి జాబితాను శుక్రవారం విడుదల చేసినట్లు అకడమిక్ డీన్ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను తెలుసుకోవచ్చని సూచించారు.
చిత్తూరు: ఇరువరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, అసిస్టెంట్ ప్లంబర్ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు PH కాలనీ వద్ద గల NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో ఈ ఏడాది ఫిబ్రవరిలో M.Tech మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్టు మహిళా యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారిణి పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమోషన్‌పై మైనింగ్ శాఖ కమిషనర్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ ధ్యానచంద్రను నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసే శాలువాతో సత్కరించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అమరావతిలో కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దిరెడ్డితో పాటు ఇతరులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను జూన్ 24న ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. అందుకు భిన్నంగా పెద్దిరెడ్డి ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభివాదం చేశారు.
తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగ అన్నారు. పోలీసులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు 15 నిమిషాలు యోగ చేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు.
చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు సీఐ మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. గతంలో ఆయన కర్నూలు జిల్లా పగిడ్యాల ఎస్ఐగా పని చేశారు. అక్కడ ఘనపురం అనే గ్రామానికి చెందిన నరేంద్ర రెడ్డిని 2015లో విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని పిలిచారు. వారెంట్ ఉంటేనే వస్తానని నరేంద్ర చెప్పగా.. మారుతి కోపంతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా సీఐకు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (IIDT) నందు 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. AI/ML సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://iidt.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.
Sorry, no posts matched your criteria.