India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రెడ్డి నాయక్ విధి నిర్వహణలో ఉంటూ గుండెపోటుకు గురయ్యారు. సిబ్బంది హుటాహుటిన ఆయనను రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రిలో ఎస్ఐ మృతదేహానికి ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి, గౌరవ వందనం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నియోజకవర్గంలో పలు మండలాలకు నూతన తహశీల్దార్లను కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమలకు బెన్ను రాజ్, చౌడేపల్లికి హనుమంతు, సదుంకు కులశేఖర్ ను నియమించారు. జిల్లాలో 30 మంది తహశీల్దార్లకు పోస్టింగులు ఇచ్చారు.

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జులైలో జరిగిన డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. B.A, B.COM, BSC, BCA, BBA, BA 2, 4వ సెమిస్టర్ల ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రూ.కోట్ల విలువైన మద్యం, డబ్బు ఎన్నికల్లో పంచి నన్ను ఓడించాలనుకున్నారు. భయపెట్టినా సరే ప్రజలు నన్ను గెలిపించారు. ఆయన పుంగనూరులో గెలిచినా అక్కడ ప్రజల్లో తిరగలేకుండా ఉన్నారు. ఇదంతా కర్మ ఫలం’ అని బీఎన్ కండ్రిగలో జరిగిన పింఛన్ల పంపిణీలో ఆదిమూలం ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో MSc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ మేరకు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. GAT-B 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు www.spmvv.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 10.

రాష్ట్రవ్యాప్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు 7వ స్థానం, తిరుపతి జిల్లాకు 8వ స్థానం లభించినట్లు జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 270619 మంది ఉండగా 264268 మందికి పెన్షన్ పంపిణీ జరిగినట్లు తెలిపారు. 97.67 శాతం పంపిణీతో 7వ స్థానంలో చిత్తూరు జిల్లా ఉన్నట్లు తెలిపారు. 267772 మందికిగాను 261291 పంపిణీ చేసి 97.58 శాతంతో 8వ స్థానంలో తిరుపతి జిల్లా ఉన్నట్లు తెలిపారు.

తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది (PG) ఎం ఫార్మసీ (M.Pharmacy) 3, 4, M.A, M.COM 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు హరిజనవాడలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మామిడి తోటలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు తన నోట్లో పురుగుల మందు పిచికారి చేసుకోవడంతో అస్వస్థతకు గురి అయ్యాడు. రంగంపేటలోని ఓ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం <<13742093>>మండలం<<>> గుండి శెట్టిపల్లి వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాళ్లబూదుగూరు ఎస్సై నరేశ్ తెలిపారు.

తిరుపతి జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 96.98% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి: తిరుపతి(R)96.32, శ్రీకాళహస్తి(M)98.05, తిరుపతి(M)97.67, రేణిగుంట 96.79, చంద్రగిరి 96.74, వెంకటగిరి 97.21, నాయుడుపేట 97.58, వడమాల పేట 96.55 పంపిణీ చేసినట్లు తిరుపతి కలెక్టర్ యస్. వెంకటేశ్వర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.