India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బందితో బుధవారం సమావేశమై వారి పనితీరును సమీక్షించారు. స్థానిక పోలీసు గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. 2024 సంవత్సరంలో క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 34 కేసులు నమోదు కాగా.. అన్నింటిని ఛేదించి 83% రికవరీ రేటుతో సమర్థవంతంగా పనిచేసిన తిరుపతి క్రైమ్ పోలీసులను ప్రశంసించారు. కేసుల చేదనలో ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడి సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు SV మెడికల్ కళాశాల ఎదురుగా NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 24.
ఆటో బోల్తాపడి గాయపడ్డ విద్యార్థి మృతి చెందినట్లు ముదివేడి SI మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలంలో ఆటో బోల్తా పడిన విషయం తెలిసిందే. ముదివేడుకు చెందిన ఎస్.రఫీ కొడుకు ఎస్.జియావుల్లా(15)స్థానిక మోడల్ స్కూల్లో10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
రాష్ట్రంలో 2 MLC సీట్ల భర్తీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు వీటి కోసం పోటీ పడుతున్నారు. జనసేన కోసం తిరుపతిలో సుగుణమ్మ తన టికెట్ వదులుకున్నారు. అలాగే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు MLA బొజ్జల సుధీర్ రెడ్డి కోసం పనిచేశారు. పార్టీ కోసం కష్టపడిన ఇలాంటి వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వాళ్ల అనుచరులు కోరుతున్నారు.
ఐటీఐల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చిత్తూరు ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. మొదటి రోజు మెరిట్ ప్రకారం ఉదయం 1 నుంచి 100 వరకు, మధ్యాహ్నం 101 నుంచి 205వరకు అడ్మిషన్లు ఇస్తారు. 21న 206నుంచి 350వరకు, తర్వాత 351 నుంచి 451వరకు, 22న ఉదయం 452నుంచి 600వరకు, మధ్యాహ్నం 601నుంచి 743 వరకు ప్రవేశాలు జరుగుతాయన్నారు.
రుషికొండపై నిర్మాణాలను సమర్థిస్తూ రోజా <<13465987>>ట్వీట్ <<>>చేశారు. ఇందులోనే చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం, ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉండటంపై రోజా విమర్శలు చేశారు. దీనికి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్‌కు.. మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు’ అని భాను ట్వీట్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(PCB) సభ్యుడిగా వ్యహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పూతలపట్టు అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మురళి మోహన్ చేతిలో ఓడిపోయారు. అలాగే రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోవడంతో సునీల్ కుమార్ తన PCB సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వయోవృద్ధుల దర్శనార్థం వారి టికెట్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా అబద్దమని, ఇటువంటి ఫేక్ న్యూస్ భక్తులు నమ్మొద్దని TTDవిజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD ప్రతినెల 23న 3నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందన్నారు. www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించగలరన్నారు.
తనని కలవడానికి వచ్చేవారు శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. అభిమానం కోసం, శుభాకాంక్షలు తెలపడానికి ఏదైనా తీసుకురావాలంటే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్ లాంటివి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు దీనిని విన్నపంగా భావించాలని తెలిపారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఫోర్ట్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Sorry, no posts matched your criteria.