India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగం పేరుతో మోసం చేసిన ముగ్గురిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం సంతపేటకు చెందిన వైష్ణవి(24) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. మురకంబట్టుకు చెందిన రాజేశ్, విజయ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఉద్యోగం తీసిస్తామని చెప్పి ఆమె వద్ద రూ.2.90 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం తీసి ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు ఆన్ లైన్ కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన ఒక ఏఎస్ఐ, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్ లను స్థానిక కంట్రోల్ రూమ్ సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అభినందించారు. పెరిగిన బాధ్యతలను నూతన ఉత్సాహంతో మరింత సమర్థవంతంగా, క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు. వారికి వివిధ పోలీస్ స్టేషన్లకు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కేవీబీపురంలోని పేరడి గ్రామంలో సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన రవి కొడుకు మునస్వామి అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
తిరుమలలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని తెలిపింది.
వైసీపీ ఓటమితో ఎన్నికల ఫలితాల రోజే టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో కీలకమైన ఈ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నేతలు పోటీపడుతున్నారు. ముందుగా నాగబాబుకు ఛైర్మన్ పదవి ఖరారైందని వార్తలు రాగా ఆయన దీనిని ఖండించారు. ఓ టీవీ అధినేత, నిర్మాత పేరు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరకు పదవి ఎవరి దక్కుతుందో చూడాలి మరి.
వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తిన్నదంతా కక్కిస్తామని రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ‘పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం. అక్రమ సంపాదన కోసం పాలు, ఇసుక, మద్యం, ఎర్రచందనం దేన్నీ ఆయన ఫ్యామిలీ వదల్లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అనుమతులు లేకుండా రూ.700 కోట్లతో రిజర్వాయర్ కట్టారు. అక్కడ రైతుల భూములు లాగేసుకున్నారు’ అని ఆయన ఆరోపించారు.
కూటమి జోరులోనూ పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరైన సదుం మండలం ఎర్రాతివారిపాలెంలో ఆయనకు పడిన ఓట్లపై పలువురు ఆరా తీస్తున్నారు. స్థానిక గ్రామంలో మొత్తం 862 ఓట్లు ఉన్నాయి. ఇందులో 846 మంది వైసీపీకి ఓటు వేశారు. కేవలం 9 మందే టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి ఓటు వేశారు. ఐదుగురు కాంగ్రెస్‌కు, ఇద్దరు బీసీవై పార్టీకి మద్దతు తెలిపారు.
ఒకే లెటర్‌పై 56 మందిని శ్రీవారి దర్శనానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిఫర్ చేయడంపై విమర్శలు వచ్చాయి. దానిపై ఆయన స్పందించారు. ‘TTD నిబంధనల మేరకు సోమవారం నుంచి గురువారం వరకు స్థానిక MLAగా 10 మందికి, ప్రభుత్వ విప్‌గా మరో 10 మందికి లెటర్ ఇచ్చా. తుడా ఛైర్మన్, TTD పాలకమండలి సభ్యుడిగా నా బిడ్డ మోహిత్ 20 మందిని సిఫార్సు చేశాడు. దేవుడు దగ్గర తప్పు చేయను. ఆ మనస్తత్వం నాది కాదు’ అని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.