India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాగునీటి సమస్యలపై జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు సదరు పోస్టర్‌ను విడుదల చేశారు. కాల్ సెంటర్ నెంబర్ 9441725450 కు ప్రజలు అన్ని పని దినములలో, సమయాలలో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

తిరుపతి బస్టాండ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి నగరానికి చుట్టూ పక్కల కొండలు, బస్టాండ్‌కు ఇరువైపుల ఎత్తైన భవంతులు ఉన్న ఫొటో చూపరులను ఆకట్టుకుంటోంది.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని MBA 2023 2024 మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఆగస్టు 1 గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ మంగళవారం తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలు 10 గంటల నుంచి 12 వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు 2 గంటల నుంచి 5 గంటలకు వరకు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రానికి అర గంట ముందే చేరుకోవాలని తెలిపారు.

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, B.Sc మ్యాథ్స్, కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 265 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మదనపల్లెలో రికార్డుల దగ్ధం ఘటనలో ఇప్పటి వరకు ఉద్యోగులే బలయ్యారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు సస్పెండ్‌కు గురికాగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదైంది. సస్పెండ్ అయిన అధికారులు వీళ్లే.
☞ మురళి (పూర్వ ఆర్డీవో)
☞ హరిప్రసాద్(ప్రస్తుత ఆర్డీవో)
☞ వలీబసు-మదనపల్లె సీఐ(వీఆర్)
☞ గౌతమ్ తేజ్(సీనియర్ అసిస్టెంట్)
☞ హరిప్రసాద్, భాస్కర్(కానిస్టేబుళ్లు)

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రభుత్వ టీచర్లు రాష్ట్రస్థాయి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్(NFTW) అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో దేవరాజు సూచించారు. జడ్పీ, సాంఘిక సంక్షేమ, ఎయిడెడ్, మున్సిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో పనిచేస్తున్న టీచర్లు అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుల(మూడు సెట్లు)ను ఆగస్టు 5వ తేదీ లోపు MEO, DYEOకు అందజేయాలన్నారు.

తిరుపతిలో జరిగిన ఘర్షణ కేసులో మోహిత్ రెడ్డికి హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. కేసులో ఛార్జిషీట్ వేసే వరకు 15 రోజులకు ఓసారి విచారణ అధికారి వద్ద హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మోహిత్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేసిన విషయం తెలిసిందే

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఉన్న 5+5 భద్రతను కొనసాగించాలంటూ పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ(SRC) తేల్చిందని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి హైకోర్టుకు వివరించారు. SRC నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవాల్ చేసుకోవాలని జడ్జి జస్టిస్ BVLN చక్రవర్తి ఆదేశించారు.

తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ అరుణాచలం, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నెలలో డిగ్రీ (UG) B.A/B.COM/BSC/BCA/BBA/BA మొదటి (1) సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.