Chittoor

News April 24, 2024

భరత్ ఆస్తి రూ.కోటి కన్నా తక్కువే..!

image

➤ కుప్పం అభ్యర్థి: KRJ భరత్ (YCP)
➤ చరాస్తి: రూ.98.47 లక్షలు
➤ స్థిరాస్తి: రూ.30 లక్షలు
➤ భార్య దుర్గ చరాస్తి: రూ.41.88 లక్షలు
➤ ఇద్దరు పిల్లల పేరిట ఆస్తి: రూ.32.78 లక్షలు
➤ అప్పులు: రూ.11.60 లక్షలు
➤ బంగారం: 950 గ్రాములు
➤ కేసులు: ఒకటి
➤ వాహనాలు: ఒకే కారు
NOTE: తనకు హైదరాబాద్‌కు సమీపంలో ఓ విల్లా తప్ప ఎలాంటి స్థలాలు, బిల్డింగ్‌లు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

తిరుపతి : B.ED ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన B.ED ( బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News April 24, 2024

చిత్తూరు: సీపీఎఫ్ కంపెనీ సమీపంలో మృతదేహం కలకలం

image

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని సీపీఎఫ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే గుడిపాల పోలీసులను సంప్రదించాన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

ప్రత్యేక అలంకరణలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ

image

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జాతర ముందు నిర్వహించే వారాలలో రెండో మంగళవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. మొక్కు జొన్నతో అలంకరణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అంతేకాకుండా పౌర్ణమి సందర్భంగా చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

News April 24, 2024

12 ఏళ్లు పెద్దిరెడ్డి కోమాలో ఉన్నారా..?: నల్లారి

image

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరోసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని తాను అరెస్ట్ చేశానని 12 ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డి అంటున్నారని.. ఇప్పటి వరకు ఆయన కోమాలో ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ అరెస్ట్‌కు తనకేంటి సంబంధమన్నారు.

News April 24, 2024

MLA అభ్యర్థిగా బజ్జీలు అమ్మే మహిళ నామినేషన్

image

మదనపల్లె స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమాదేవి నామినేషన్ దాఖలుచేశారు. పట్టణంలోని రామగోపాల్ నాయుడు వీధికి చెందిన ఆమె బజ్జీల వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఆమె సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మహిళల పక్షాన అసెంబ్లీలో తన గళం వినిపిస్తానని చెప్పారు.

News April 24, 2024

తిరుపతి: రైతు కూలి కుమార్తెకు 597 మార్కులు

image

కలకడ మండలం గరడప్పగారిప్లలెలోని ఏపీ గురుకుల(బాలికలు) పాఠశాల విద్యార్థిని పి.లిఖిత 597 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సుమిత్ర తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తవేపకుప్ప గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలి ఇంటి జన్మించిన పి.లిఖిత రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడంతో పలువురు అభినందించారు.

News April 24, 2024

చిత్తూరు జిల్లాలో 44 నామినేషన్లు దాఖలు

image

చిత్తూరు జిల్లాలో సోమవారం 44 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి 5, పుంగనూరు అసెంబ్లీకి 5, నగిరికి ఒకటి, చిత్తూరుకు నాలుగు, పూతలపట్టుకు 6, పలమనేరుకు ఆరు, కుప్పం అసెంబ్లీకి ఆరు నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

News April 24, 2024

తిరుమలలో నేటి గరుడ సేవ రద్దు

image

తిరుమల శ్రీవారి ఆల‌యంలో నేడు రాత్రికి జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీ‌వారి వార్షిక వ‌సంతోత్స‌వాలు మూడు రోజుల పాటు జ‌రుగుతున్న కార‌ణంగా గరుడసేవ ర‌ద్ద‌ు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.

News April 24, 2024

తిరుపతి పార్లమెంట్ పరిధిలో 46 నామినేషన్లు

image

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, ఓ ఎంపీ స్థానానికి సోమవారం 46 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎంపీ స్థానానికి 5 మంది అభ్యర్థులు, శాసనసభ స్థానాలకు 41 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈనెల 25 వరకు నామినేషన్ సేకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.