Chittoor

News June 15, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

జూన్ 17 వరకు వారాంతపు సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లు యాత్రికులతో నిండిపోయాయి. గురువారం నుంచి యాత్రికుల తాకిడి తగ్గలేదు, సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగనుంది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా అందిస్తున్నారు.

News June 15, 2024

నిండ్ర: గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

నిండ్ర మండలం నిండ్ర ఉన్నత పాఠశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు సురేష్ బాబు గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలాడు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు సురేష్ బాబు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

News June 15, 2024

SVU డిగ్రీ సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈనెల 12వ తేదీ నుంచి డిగ్రీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్/ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 18వ తేదీ జరగాల్సిన పరీక్షను జలై 9వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. 18వ తేదీ UGC NET ఎగ్జామ్ జరుగుతున్న కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 15, 2024

చిత్తూరు:18న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ఈ నెల 18న చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్‌లోని నూతన సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లాకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 15, 2024

చిత్తూరు: లారీ ఢీకొని ఒకరు స్పాట్ డెడ్

image

చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలోని దాసర్లపల్లి-కుప్పం రహదారిలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి, మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

News June 15, 2024

చిత్తూరు: అక్రమంగా జంతువులను తరలిస్తే చర్యలు: కలెక్టర్

image

శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో మాట్లాడారు. జిల్లా బక్రీద్ పండుగను పురస్కరించుకొని జంతువులను వధించిన, అక్రమంగా తరలించినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పంచాయతీ స్థాయిలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News June 15, 2024

తిరుపతిలో యువకుడు దారుణ హత్య

image

తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లోని ఓఆయిల్ షాపు వద్ద ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మృతుడు ముంగిలిపట్టుకు చెందిన మాదం ప్రసాద్‌గా గుర్తించారు. మద్యంమత్తులో గుర్తుతెలియని వ్యక్తులు ప్రసాద్‌తో శుక్రవారం రాత్రి 2 గంటల వరకు గొడవపడి, వెంటబడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఈస్ట్ డీఎస్పీ రవిమనోహరచారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News June 15, 2024

కె.వి పల్లి: గురుకులంలో ఉద్యోగ అవకాశాలు

image

కేవీ పల్లి మండలంలోని గ్యారంపల్లె గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, ఆంగ్లంలో బోధించేందుకు తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ ను సంప్రదించాలని కోరారు.

News June 15, 2024

అర్జున్ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన ఆర్కే రోజా

image

యాక్షన్ కింగ్, ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళ హాస్యనటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య పెళ్లయిన విషయం తెలిసిందే. శుక్రవారం చెన్నైలోని ఓ ప్యాలెస్‌లో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

News June 15, 2024

తిరుపతి: 16న UPSC ప్రిలిమ్స్ పరీక్ష

image

తిరుపతి జిల్లాలో ఈనెల 16న ఆదివారం UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.