India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ వడదెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం.. ఎన్నికల విధులకు తంబళ్లపల్లికి వెళ్తున్న మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్ద వడదెబ్బ తగలడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేశ్ అనే యువకుడు తన కారులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బి.ఫాం తీసుకోవడానికి మదనపల్లెకి వచ్చిన చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు మొక్కి బీఫాం అందుకున్నారు. ఈ కార్యక్రమం మదనపల్లెలో ఆదివారం ఎన్నికల ప్రచారసభ మిషన్ కాంపౌండ్‌లో జరిగింది. అందరూ కష్టపడి గెలవాలని పెద్ది రెడ్డి సూచించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీఫాంలు అందజేశారు. మదనపల్లెలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో భరత్(కుప్పం), వెంకటే గౌడ(పలమనేరు), డాక్టర్ సునీల్(పూతలపట్టు), రెడ్డెప్ప(చిత్తూరు ఎంపీ) వీటిని అందుకున్నారు. అందరూ కష్టపడి పనిచేసి గెలవాలని పెద్దిరెడ్డి సూచించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీఫాంలు అందజేశారు. ముందు రోజు ఇచ్చిన సమాచారంతో అభ్యర్థులంతా మంగళగిరికి చేరుకున్నారు. చంద్రబాబు మినహాయిస్తే చిత్తూరు జిల్లాలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రా రెడ్డికి బీఫాం ఇవ్వలేదు. ఇక్కడ అభ్యర్థిని మార్చడం లేదా బీజేపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీపాం ఇవ్వకుండా ఆపారు.
ఎన్నికలు జరిగే మే 13న ఉద్యోగ, ఉపాధి, కార్మికులకు సెలవు రోజని కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ బాలు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం- 1988 ప్రకారం ఎన్నికల రోజున వేతనాలతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అర్హుడైన ఓటరుకు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించి సెలవు జారీ చేయకపోతే జరిమానాతో కూడిన శిక్షార్హులని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఫారం-12ను పూర్తి చేసి.. హెచ్ఓడీల ద్వారా కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. ఇందుకోసం ఈనెల 22 వరకు ఉన్న గడువును 23కు పెంచినట్టు చెప్పారు.
తిరుపతి జిల్లా పరిధిలో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ తొలగించారు.ఈ మేరకు తిరుపతి జిల్లా SP కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో గంజాయి ముఠా అరెస్ట్ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం నాయుడు, లంచం అడిగిన భాకరాపేట కానిస్టేబుల్ వెంకటరమణపై వేటు వేశారు. అలాగే మద్యం తాగి రైటర్‌తో గొడవపడిన పాకాల హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేశారు. తాజాగా వీరిపై సస్పెండ్ ఎత్తేశారు.
YCP బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, పుత్తూరు మాజీ MPP ఏలుమలై అలియాస్ అమ్ములు TDPలో చేరారు. ఆయనతో పాటు DCCB మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి, బిల్డర్ వెంకటమునికి నగరి MLA అభ్యర్థి గాలి భానుప్రకాశ్ సమక్షంలో చంద్రబాబు పసుపు కండువా కప్పారు. నగరి నియోజకవర్గంలో మొదలియార్ సామాజికవర్గ ఓటర్లు 32 వేల మంది ఉన్నారు. అదే సామాజికవర్గానికి చెందిన ఏలుమలై YCPని వీడటం ఆ పార్టీకి నష్టమేనని పలువురు భావిస్తున్నారు.
నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా అభ్యర్థులు రెండు మూడు సెట్లతో పాటు డమ్మీలు వేస్తుంటారు. ఇలా తాజా ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 8 నామినేషన్లు పడ్డాయి. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2, ఆయన భార్య 2 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లెలో 2 సెట్లు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కుమారుడు మిథున్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ వేశారు.
తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానం, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడవరోజు శనివారం 20 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన చెప్పారు. ఆదివారం సెలవు కావడంతో నామినేషన్ల స్వీకరణ లేదన్నారు. ఈనెల 25 వరకు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.