India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రివర్గంలో 25 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతానికి 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులకూ కేబినెట్ హోదా వర్తిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు. ఈనేపథ్యంలో ఖాళీగా ఉన్న ఓ బెర్త్‌తో పాటు, దానికి సమానంగా భావించే కేబినెట్ హోదా పదవులపై జిల్లా ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి ఏ పదవి వస్తుందో వేచి చూడాలి మరి.
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన తిరుచానూరుకు వచ్చారు. అక్కడ అమ్మవారి దర్శనం అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు వీడ్కోలు పలకగా.. ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరుగు ప్రయాణమయ్యారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు లభించింది. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం పొట్టేళ్ల సంత జరిగింది. బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేళ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో జత పొట్టేళ్లు ధర రూ. 40 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు పలికింది. పొట్టేళ్ల సంతకు కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. దీంతో సంతలో సందడి నెలకొంది.
శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం (SPMVV)లో ఈ ఏడాది మే నెలలో బీటెక్ (B.Tech) నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారిని పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
జిల్లాలో పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2900 యాజమాన్య పాఠశాలల్లో 2,39,629 మంది చదువుతున్నారు. 2483 ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1,67,941 మంది విద్యార్థులు ఉండగా, 417 ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు 71,688 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా, పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
చిత్తూరు స్థానిక సంతపేట సమీపంలోని తిమ్మసముద్రంలో గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రజలు ఊరేగింపుగా వచ్చి గంగమ్మకు సారెను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, వాయిద్యాల నడుమ నిమజ్జన వేడుకలు ఘనంగా పూర్తిచేశారు. పాలసముద్రం మండలంలోని శ్రీకావేరిరాజుపురం, బలిజకండ్రిగ గ్రామాల్లో రెండ్రోజులుగా గంగమ్మ జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంగారుపాళ్యం మండలంలోని తగ్గువారిపల్లెలో గంగ జాతర వైభవంగా జరిగింది.
ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి దారుణ హత్యకు గురైన ఘటన మదనపల్లెలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికంకాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద కాపురం ఉంటున్న టీచర్ దొరస్వామి(62)ను ఎవరో తన ఇంటిలోనే పథకం ప్రకారం మరణాయుధాలతో దారుణంగా హత్యచేసి పరారయ్యారు. మృతదేహాన్ని 1టౌన్, తాలూకా సిఐలు వల్లి భాష, శేఖర్ లు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
APSSDC ఆధ్వర్యంలో పైతాన్, డేటా బేస్, డేటా అనలిటిక్స్ స్కిల్స్‌పై 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. బీటెక్ 3, 4 సంవత్సరాల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు https://swiy.co/360interns2024 వెబ్‌సైట్లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. చివరి తేదీ జూన్ 27.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 14వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. అపోలో ఫార్మసీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డీఫార్మసీ, బీఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులన్నారు. 50 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.