India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో ప్రాజెక్టు అసోసియేట్ – 01 పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ (M.Sc) బయాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 02.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శనివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా సినీ నటి సంయుక్త మీనన్ తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు అధికారులు బస, దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆమె ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకోనున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి అఫిడవిట్‌లోని వివరాల మేరకు చరాస్తులు రూ.10.59 కోట్లు, స్థిరాస్తులు రూ.114.25 కోట్లు ఉన్నాయి. భార్య పేరిట చరాస్తి రూ.14.55 కోట్లు, స్థిరాస్తి రూ.66.79 కోట్లు ఉంది. గత ఎన్నికలప్పుడు పెద్దిరెడ్డి ఆస్తి 91.74 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 124.84 కోట్లకు పెరిగింది. ఆయన భార్య ఆస్తి రూ.39.22 కోట్ల నుంచి రూ.110.55 కోట్లకు పెరిగింది. పెద్దిరెడ్డిపై ఒక్క కేసు కూడా లేకపోగా ..కారు కూడా లేదు.
గత ఐదేళ్లలో మంత్రి రోజా ఆస్తులు పెరిగాయి. 2019లో ఆమె చరాస్థులు రూ.2.74 కోట్లు కాగా ఇప్పుడు రూ.4.58 కోట్లయ్యాయి. స్థిరాస్తులు రూ.4.64కోట్లు ఉండగా రూ.6.05 కోట్లకు చేరాయి. 2019లో ఆరు కార్లు, ఓ బైకు ఉండగా.. ఇప్పుడు 9 కార్లు ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో భర్త పేరుపై 6.39 ఎకరాలు కొన్నారు. కేసులు లేవు, ఆమె దగ్గర 986 గ్రాములు, భర్త దగ్గర 485 గ్రాముల బంగారం ఉంది. అప్పులు రూ.1.66 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారు.
తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు 24 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారన్నారు. నామినేషన్ల పురస్కరించుకొని నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈనెల 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు.
రామసముద్రం మండలంలో కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 14మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రామసముద్రం ఎస్సై చంద్రశేఖర్ కథనం.. సింగిరిగుంటకు చెందిన కూలీల ఆటోలో రామసముద్రం మండలం, మినికికు కూలి పనులు చేయడానికి బయలుదేరారు. మినికి వద్ద ఆటోను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగోసారి పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కుమార్తె శ్రీశక్తితో కలిసి నామినేషన్‌ను ఆర్వోలకు అందజేయడం 20 ఏళ్లుగా సెంటిమెంటుగా కొనసాగుతోంది. ఈసారి కూడా ఆమె చేత హనుమంతరాయనదిన్నెలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం తండ్రి పెద్దిరెడ్డితో కలిసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు.
➤ నియోజకవర్గం: చిత్తూరు
➤ అభ్యర్థి: గురజాల జగన్మోహన్ (TDP)
➤ స్థిరాస్తి విలువ: రూ.88.22 కోట్లు
➤ చరాస్తి విలువ: రూ.5.14 కోట్లు
➤ భార్య ప్రతిమ స్థిరాస్తి: రూ.36.67 కోట్లు
➤ బంగారం: 3.67 కేజీలు
➤ కేసులు: లేవు
➤ వాహనాలు: 4(3 కార్లు, హ్యార్లీ డేవిడ్సన్ బైక్)
➤ అప్పులు: రూ.17.52 కోట్లు
NOTE: రూ.7.75 లక్షల విలువైన వాచ్‌తోపాటు బెంగళూరులో కమర్షియల్ స్థలాలు, బిల్డింగ్‌లు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు.
భార్యే భర్తను చంపిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 25న రాతపరీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత హాల్ టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయని గురుకులాల జిల్లా సమన్వయకర్త ఆంజనేయ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8వ తరగతులకు 25న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.