India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
CM చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 9 గం.కు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. తిరుమలలోని శ్రీగాయత్రి నిలయం గెస్ట్‌హౌస్‌లో బసచేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. CM తిరుపతి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.
శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు వారి వారి పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మండల సభ్యులు కొంతమంది మరుసటి రోజు రాజీనామా చేశారు. అయితే మరి కొంతమంది సభ్యులు, అధ్యక్షులు రాజీనామా చేయకపోవడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు ఆలయ ధర్మకర్తల మండలి మూకుమ్మడిగా రాజీనామా చేసి ఆ పత్రాన్ని ఆలయ ఈఓకి అందజేశారు.
TDP అధినేత చంద్రబాబు 24మందితో కూడిన తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మినహా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు 11 టీడీపీ, ఒకటి జనసేన, రెండు వైసీపీ గెలిచింది. కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా గత ప్రభుత్వంలో జిల్లా నుంచి పెద్దిరెడ్డి, రోజా, నారాయణస్వామి మంత్రులుగా చేయడం తెలిసిందే.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) పీజీ (PG) M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. GAT-B 2024 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 15.
పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలోని రాడార్ కేంద్రం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ, మరో వ్యక్తి మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న కుటుంబంగా భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం చంద్రబాబు రానున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకొని గాయత్రి నిలయం అతిథి భవనంలో బసచేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్నారు. 9 గంటలకు తిరుమలలో నుంచి అమరావతికి తిరిగి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నూతన మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు మాత్రమే సీఎం హోదాలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మిగిలిన ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. సీనియర్ కోటాలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎస్సీ కోటాలో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామస్, మురళి మోహన్ పేర్లు వినిపించాయి. అలాగే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ పేరు తెరపైకి వచ్చినా.. ఎవరికీ పదవులు ఇవ్వలేదు.
సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి. అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తిరుపతి – కాట్పాడి (07659) కాట్పాడి – తిరుపతి (07582) ప్యాసింజర్ రైలు ను మూడు వారాలపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. తిరుపతి – కాట్పాడి సెక్షన్ నందు ఇంజనీరింగ్ వర్క్స్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. నేటి నుండి జూన్ 30 వరకు ఈ రైలు తాత్కాలికంగా నడవదన్నారు . ప్రజలు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.