Chittoor

News April 17, 2024

చిత్తూరు: తమ్ముడిని తుపాకీతో కాల్చిన అన్న

image

గుర్రంకొండ మండలం తుమ్మల గొందిలో భూ వివాదం తలెత్తి తమ్ముడిని అన్న తుపాకీతో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుని కథనం.. మండలంలోని తుమ్మల గొంది హరిజనవాడలో కాపురం ఉంటున్న బాలపోగు విశ్వనాథ(45)కు అతని అన్న బాలపోగు జయప్పకు కొంతకాలంగా భూ వివాదమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఇద్దరూ గొడవపడగా జయప్ప తుపాకీతో కాల్చారు.

News April 17, 2024

చిత్తూరు : ఎన్నికల అబ్జర్వర్ల నియామకం

image

జిల్లాలోని ఒక పార్లమెంట్, 7అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటు, నియోజకవర్గ ఎక్స్పెండీచర్ అబ్జర్వర్‌గా శంకర్రాప్రసాద్, నగరి అసెంబ్లీ, GDనెల్లూరు నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్‌గా కైలాశ్ వాంఖడే, చిత్తూరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు షాధిక్ అలం, ఎక్సెండీచర్ అబ్జర్వర్‌‌గా రోహన్రాఖుర్ నియమితులయ్యారు.

News April 16, 2024

చిత్తూరు: SPని ఆశ్రయించిన ప్రేమజంట

image

చిత్తూరు : ప్రేమ పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండని అని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు. పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె జాస్మిన్, తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చారాల దళితవాడకు చెందిన మురుగేశ్ కుమారుడు తిరుమలేష్ మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త తిరుమలేశ్ ఎస్సీ కులస్తుడు కావడంతో మా తల్లిదండ్రులు అడ్డుపడ్డారని ఆమె వాపోయారు.

News April 16, 2024

TPT: దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల

image

తిరుపతి: శ్రీవేంకటేశ్వర దూరవిద్య(DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ (PG) ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News April 16, 2024

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పీవీ సింధు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరి యాదవ్, సీఎస్ఓ నాగభూషణం వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు.

News April 16, 2024

వైసీపీ-టీడీపీలు బీజేపీకి బానిసలు: షర్మిల

image

ఆలోచించి ఓటు వేయకపోతే మీ జీవితాలను ఇతరులకు రాసిచ్చినట్లేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం పీలేరు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారారన్నారు. పీలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

News April 16, 2024

చిత్తూరులో నామినేషన్ కేంద్రాలు ఇవే

image

చిత్తూరు జిల్లాలో ఎల్లుండి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎవరు, ఎక్కడ నామినేషన్ వేయాలో తెలుసా..?
➤ చిత్తూరు MP: చిత్తూరు కలెక్టర్ ఆఫీసు
➤ పుంగనూరు MLA: పుంగనూరు MRO ఆఫీసు
➤ నగరి MLA: నగరి MRO ఆఫీసు
➤ GDనెల్లూరు MLA: జీడీనెల్లూరు MRO ఆఫీసు
➤ చిత్తూరు MLA: జాయింట్ కలెక్టర్ ఆఫీసు, CTR
➤ పూతలపట్టు MLA: పూతలపట్టు MRO ఆఫీసు
➤ పలమనేరు MLA: పలమనేరు RDO ఆఫీసు
➤ కుప్పం MLA: కుప్పం MRO ఆఫీసు

News April 16, 2024

చిత్తూరు కలెక్టర్ కీలక సూచన

image

చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జాతర నిర్వహణపై కలెక్టర్ షన్మోహన్ కీలక సూచనలు చేశారు. మే 10 లోపు లేదా మే 15 తర్వాత గంగ జాతరలు చేసుకోవాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. జాతర నిర్వహణకు పోలీస్ స్టేషన్ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయరాదని సూచించారు.

News April 16, 2024

రాళ్లు వేయించుకుంటే సింపతీ రాదు: పెద్దిరెడ్డి

image

సీఎం జగన్‌పై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందోనన్న భయం టీడీపీలో మొదలైందని.. అందుకే చంద్రబాబు తన మీద తానే రాళ్లు వేయించుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. సింపతీతో ప్రజలు ఓట్లు వేయరని ఆ ఘటన నిరూపించింది. సీఎం జగన్‌పై దాడి విషయంలో చంద్రబాబు, లోకేశ్ నీచంగా మాట్లాడుతున్నారు’ అని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

News April 16, 2024

పుత్తూరు: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అల్లుడు

image

నగరి నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లుడు, పుత్తూరు పట్టణ 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ జాన్ కెనడీ టీడీపీ గూటికి చేరారు. ఆయనకు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెనడీతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీని వీడారు. కోనేటి ఆదిమూలం కూడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరడం విశేషం.