India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2009 సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయపరంగా చిత్తూరు నియోజకవర్గ సెంటిమెంట్ మారింది. 2004 వరకు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. 2009 నుంచి చిత్తూరు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంప్రదాయం వచ్చింది. అయితే 2009, 2014, 2019 అక్కడ గెలిచిన పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2024 ఎన్నికలో గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని 31 మండలాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పాలసముద్రం మండలంలో 73.4 మి.మీ., పలమనేరు 71.2, బైరెడ్డిపల్లె 67.2, గంగవరం 57.8, తవణంపల్లె 57.2, రామకుప్పం 38.2, వి.కోట 36, చిత్తూరు టౌన్ 33.4, కుప్పం 29, పూతలపట్టు 28. 6, చౌడేపల్లె 28.4, గుడుపల్లె 27.6, జీడీ నెల్లూరు 27.2, ఐరాల 26.2 మి.మీ నమోదైంది. జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
యజమాని వేధింపులు భరించలేక
ట్రాక్టర్ డ్రైవర్ చీమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మదనపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. బసినికొండ పంచాయతీ, జన్మభూమి కాలనీకి చెందిన సైసావల్లి(35) నవీన్ వద్ద రూ.90 వేలు అప్పుగా తీసుకుని ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. తానిచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని యజమాని వేధింపులకు గురి చేయడంతో మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి తరలించారు.
నగరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గాలి భానుప్రకాశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఉండవల్లి నివాసంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గాలి భానుప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గాలి భానుప్రకాశ్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు వెల్లడించారు.
ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములకల చెరువులో జరిగింది. ఎస్సై తిప్పేస్వామి వివరాల ప్రకారం. దేవలచెరువుకు చెందిన నరేంద్ర(25) పొరుగు గ్రామానికి చెందిన మైనర్(17)తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు. వీరి మధ్య ఏం జరిగిందో ఏమో ఆ ప్రేమజంట బత్తలాపురం అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని ఎస్‌ఐ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.
2024 సార్వత్రిక ఎన్నికలలో సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరాజయం చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ శనివారం సురుటుపల్లి ఆలయ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఏవీఎం బాలాజీ రెడ్డి తెలిపారు. తనతో పాటు పాలకమండలి సభ్యులు సైతం రాజీనామా చేయనున్నారని తెలిపారు. ఆలయ ఛైర్మన్‌గా పనిచేసిన పదవీకాలంలో తనకు సహకరించిన రాజకీయ ప్రతినిధులకు, ఆలయ సిబ్బందికి, అధికారులకు, ధన్యవాదాలు తెలిపారు.
టీటీడీని అప్రతిష్ఠ పాలు చేసిన ఈఓ ధర్మారెడ్డికి శిక్ష తప్పదని టీడీపీ నేత వినుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో జగన్ రెడ్డి తన సామాజికవర్గ అధికారులను కీలక స్థానాల్లో నియమించారని చెప్పారు. అవినీతికి పాల్పడటానికి జగన్ ఇలా చేశారని ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులు మురళీకృష్ణ, వినుకొండ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి మిట్టపల్లి భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. కన్నబాబుకు పంపించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై వైసీపీ కార్యక్రమాలలో పాల్గొంటూ 2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు .
నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో సత్యవేడు కూటమి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ‘మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’ అంటూ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదిమూలానికి సూచించారు.
చిత్తూరు MP అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప ఒక్క నియోజకవర్గంలో కూడా ఆధిక్యం చూపలేకపోయారు. చంద్రగిరిలో1,43,841 ,నగరిలో 1,01,839, జీడీనెల్లూరులో 96, 883, చిత్తూరులో 85,414, పూతలపట్టులో 98,985, పలమనేరులో 1,20,273, కుప్పంలో 1,18,301, కుప్పంలో 1,18,301 ఓట్లు దక్కించుకున్నారు.
Sorry, no posts matched your criteria.