Chittoor

News April 14, 2024

CTR: ఆ 7 చోట్ల గుర్తులు మారుతాయి..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఈసారి ఎన్నికల్లో రెండు ఓట్లు(MLA, MP) వేయాల్సి ఉంటుంది. పొత్తులో భాగంగా తిరుపతి, రాజంపేట MP అభ్యర్థులుగా బీజేపీ నేతలు బరిలో ఉన్నారు. దీంతో శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెలో ఒక ఈవీఎం(MLA)లో సైకిల్ గుర్తు, మరొక ఈవీఎం(MP)లో కమలం గుర్తు ఉంటుుంది. తిరుపతిలో జనసేన MLA అభ్యర్థి పోటీలో ఉండటంతో ఇక్కడ రెండు EVMలోనూ సైకిల్ గుర్తు కనపడదు.

News April 14, 2024

చిత్తూరు: ప్రభుత్వ విద్యార్థులు 68% మంది ఫెయిల్

image

చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 68 శాతం మంది ఫెయిల్ అయ్యారు. 2,581 మంది పరీక్షలు రాయగా 806(32 శాతం) మందే పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 272 మంది, అమ్మాయిలు 534 మంది ఉన్నారు. రెండో సంవత్సరంలో 2240 మందికి 1083 మందే పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 456, అమ్మాయిలు 627 మంది ఉన్నారు. ఓవరాల్‌గా ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.

News April 14, 2024

కార్వేటినగరం: SI వాహనం డ్రైవర్ ఆత్మహత్య

image

చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఎస్ఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. పాదిరికుప్పం గ్రామానికి చెందిన సందీప్(21) ఎస్ఐ పోలీసు వాహనానికి తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సందీప్ తన కుటుంబ కలహాల కారణంగా పద్మసరస్సు గ్రామం సమీపంలోని మామిడి తోటలో ఉరివేసుకున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నాడు.

News April 14, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులకు తప్పిన ప్రమాదం

image

తిరుమల నుండి తిరుపతికి వస్తున్న ఘాట్ రోడ్డు 9వ మలుపు సమీపంలో కారుటైరు పగిలిపోవడంతో అదుపు తప్పి పిట్టగోడను ఢీకొంటి. ఈ ఘటనలో భక్తులు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు భక్తులను మరో వాహనంలో తిరుపతికి పంపించారు. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, అధికారులు ట్రాఫిక్ ను చక్కదిద్దే చర్యలు చేపట్టారు.

News April 14, 2024

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు కలెక్టర్ నివాళులు 

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ అదితి సింగ్, ఆర్డిఓ నిశాంత్ రెడ్డి తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2024

చిత్తూరు:14 నుంచి రీకౌంటింగ్ కు దరఖాస్తు

image

ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని DVEO.సయ్యద్ మౌలా శనివారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 24 వరకు సబ్జెక్టుల వారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 24 నుంచి జూన్ ఒకటి వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీవీఈవో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

News April 14, 2024

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో తిరుపతి కలెక్టర్

image

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహు కేతు పూజలు చేయించారు. దర్శనం అనంతరం స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ వి నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2024

చిత్తూరు: స్ట్రాంగ్ రూముకు చేరిన ఈవీఎం పెట్టెలు

image

అంగళ్లు మిట్స్ కళాశాల స్ట్రాంగ్ రూంకు ఈవీఎం పెట్టెలు చేరినట్లు ఎస్సై మల్లికార్జున రెడ్డి తెలిపారు. సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈవీఎంలను భద్రపరిచిన పెట్టెలను శనివారం కురబలకోట మండలం, అంగళ్లు మిట్స్ కళాశాల స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర పార మిలిటరీ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశామని తెలిపారు.

News April 13, 2024

అమ్మవారి సేవలో హర్యానా గవర్నర్

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏవిఎస్వో సతీష్ కుమార్, ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News April 13, 2024

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ 

image

ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు రావడం, ఆదివారం తమిళ ఉగాది కావడంతో శనివారం తిరుమలలో భక్తల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు  భక్తులు తిరుమలకు వస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. సర్వ దర్శనానికి 20 గంటలు సమయం పడుతుందన్నారు.