India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్టు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివి ప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రక్రియపై రాజకీయ పార్టీలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఈనెల 18 నోటిఫికేషన్ రానుందని.. అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలో నిన్నటి రంజాన్ వేడుకల్లో ఉద్రిక్తతకు కారణమైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విజయానందరెడ్డి, గురుజాల జగన్మోహన్‌పై 171 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
ఇంటర్ సెకండ్ ఇయర్‌లో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలవగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులూ నిరాశపరిచారు. 50 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. 13,224 మంది పరీక్షలు రాయగా 6,566మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 53 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 12,978 మంది పరీక్షలు రాయగా 6,886 మంది పాసయ్యారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 63 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే చివరి(25) స్థానంలో నిలిచింది. 10,882 మంది పరీక్షలు రాయగా 6,817 మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 81 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 25,990 మంది పరీక్షలు రాయగా 21,062 మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 69 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 10,384 మంది పరీక్షలు రాయగా 7,153 మంది పాసయ్యారు.
ఇప్పుడు పుంగనూరు అంటేనే అందరికీ మంత్రి పెద్దిరెడ్డి, YCP గుర్తుకు వస్తుంది. కానీ పుంగనూరులో అసలు రికార్డు TDPదే. 1983 నుంచి 1996 వరకు ఆ పార్టీనే వరుసగా ఐదుసార్లు గెలిచింది. 1985 నుంచి 1994 వరకు ఎన్.రామకృష్ణా రెడ్డి(మాజీ అమర్నాథ్ రెడ్డి తండ్రి) మూడుసార్లు విజయం సాధించారు. 1996 ఉప ఎన్నికలు, 2004లో అమర్నాథ్ రెడ్డి MLAగా ఎన్నికయ్యారు. 2009, 14, 19లో ఇక్కడ గెలిచిన పెద్దిరెడ్డి ఈసారి కూడా బరిలో ఉన్నారు.
తిరుపతి-తిరుచానూరు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. తిరుచానూరు పంచాయతీ దామినేడు ఇందిరమ్మ గృహాల్లో ఉంటున్న అజయ్, బుజబుజనెల్లూరుకు చెందిన చైతన్య పనుల నిమిత్తం గురువారం తిరుపతిలోని లక్ష్మీపురానికి వచ్చారు. తిరిగి బైకుపై వెళ్తూ వేగంగా రోడ్డు పక్కనున్న ఇనుప దిమ్మెను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
కడుపు నొప్పితో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు మండలంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. రాంపల్లికి చెందిన కుమార్(33) కడుపు నొప్పితో ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో .. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. కుప్పం మందుబాబులు కర్ణాటక దుకాణాలకు వెళ్తున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటి?
గోరఖ్‌పూర్ స్పెషల్ రైలును రేపటి నుంచి కుప్పం మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కుప్పం మీదుగా కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో సోమవారం సాయంత్రం 5.40గంటలకు కుప్పం మీదుగా బెంగళూరు కృష్ణరాజపురానికి వెళ్తుంది. 6 వారాలు మాత్రమే ఈ స్పెషల్ రైలు నడవనుంది.
తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఓ యువకుడు చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బైరెడ్డిపల్లె(M) రామనపల్లికి చెందిన జయప్ప కుమారుడు యాదగిరి(26) MBA చదివి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఇంటికి వచ్చాడు. నిన్న ఉదయం పశువులకు మేత వేసి ఇంట్లోకి వచ్చాడు. తల్లిదండ్రులతో ఒంట్లో బాగోలేదని కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.