India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నుండి 47వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా బాబు విజయంపై టిడిపి నేతలు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టిడిపి కుప్పం ఇంచార్జ్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా. సురేష్ తదితరులు కుప్పం ఆర్వో శ్రీనివాసులు వద్ద డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.
➤కుప్పం:చంద్రబాబు ➤పలమనేరు: అమరనాథ రెడ్డి
➤పూతలపట్టు: మురళీ ➤చిత్తూరు: జగన్మోహన్
➤GDనెల్లూరు: థామస్ ➤నగరి: గాలి భానుప్రకాశ్
➤సత్యవేడు: ఆదిమూలం ➤శ్రీకాళహస్తి: బొజ్జల
➤తిరుపతి: శ్రీనివాసులు ➤చంద్రగిరి: పులివర్తి నాని
➤పీలేరు: నల్లారి కిశోర్ ➤పుంగనూరు: పెద్దిరెడ్డి
➤మదనపల్లె:షాజహాన్➤తంబళ్లపల్లె:ద్వారకనాథరెడ్డి
NOTE: పుంగనూరు, తంబళ్లపల్లోనే వైసీపీ గెలిచింది.
చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆయన ఆధిక్యం చూపారు. తన సమీప ప్రత్యర్థి ఎన్.రెడ్డప్ప మీద 1.80 లక్షల మెజార్టీతో గెలుపు దుందుభి మోగించారు. ఈక్రమంలో ఆయన జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.
తిరుపతి పార్లమెంట్ కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. తొలుత వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడ్డారు. తర్వాత ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ వరప్రసాద్ వరప్రసాద్‌తో హోరాహోరీ తలపడ్డారు. చివరకు గురుమూర్తికి 6,32,228 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి వరప్రసాద్ రావు 6,17,659 ఓట్లు సాధించారు. ఈక్రమంలో గురుమూర్తి 14,569 ఓట్లతో గట్టెక్కారు. ఉప ఎన్నికలో ఆయన 2,30,572 ఓట్లతో గెలవడం విశేషం.
వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వెంటనే తన రిజైన్ ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన టీటీడీ ఈవోకు లేఖ రాశారు. వైవీ సుబ్బారెడ్డి తర్వాత గత ఆగస్టు నెలలలో ఆయన ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
పుంగనూరు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 18 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 94,876 ఓట్లు సాధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,538 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. చివరి రౌండ్ ఫలితం వచ్చి దాదాపు 2 గంటలవుతున్నా.. తర్వాత అధికారులు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదట. అక్కడ ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు 1,63, 508 ఓట్ల ఆధిక్యంలో విజయం వైపు దూసుకెళ్తున్నారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుప్రసాద్ 27,520 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు రాజంపేట వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 59,127 ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో నగరి అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఏకంగా చంద్రబాబు ఆధిక్యాన్నే దాటేశారు. భానుకు 10 రౌండ్లలో 32,420 ఓట్ల ఆధిక్యం లభించింది. చంద్రబాబు కేవలం 23,610 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,764, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి 6,363 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో 36,207 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పుంగనూరులో 4, తంబళ్లపల్లెలో 10 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
తిరుపతి జిల్లాలో అన్ని చోట్లా టీడీపీ హవా ఉన్నప్పటికీ.. సత్యవేడులో మాత్రం నువ్వానేనా అన్నట్లు ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం 8,184 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేశ్‌కు 7,246 ఓట్లు వచ్చాయి. టీడీపీ 938 ఓట్ల మెజార్టీతో ముందుకు కొనసాగుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి జేడీ రాజశేఖర్‌కు కేవలం 37 ఓట్లే వచ్చాయి.
Sorry, no posts matched your criteria.