Chittoor

News June 4, 2024

లీడ్‌లోకి వచ్చిన పెద్దిరెడ్డి

image

పుంగనూరులో ఎట్టకేలకు మంత్రి పెద్దిరెడ్డి ఆధిక్యతలోకి వచ్చారు. మొదటి రౌండ్‌లో 136, రెండో రౌండ్‌లో 501 ఓట్లతో వెనుకంజలో కొనసాగారు. తాజాగా మూడో రౌండ్‌లో ఆయనకు 45 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇప్పటి వరకు పెద్దిరెడ్డికి 16,816 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

రెండో రౌండ్‌లోనూ వెనుకబడ్డ పెద్దిరెడ్డి

image

పుంగనూరులో ఇప్పటి వరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. వరుసగా రెండో రౌండ్‌లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థికి 11,359 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్‌లోనూ 501 ఓట్లతో వెనుకంజలోనే ఉన్నారు.

News June 4, 2024

మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ

image

పుంగనూరులో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుపడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 5,685 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం చల్లా 136 ఓట్ల స్వల్వ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

చిత్తూరులో టీడీపీ.. తిరుపతిలో వైసీపీ లీడ్

image

TDP చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు లీడ్‌లో ఉన్నారు. ఆయనకు 5695 ఓట్లు రాగా 1638 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్ప బరిలో ఉన్నారు. మరోవైపు తిరుపతిలో వైసీపీ అభ్యర్థి 2495 ఓట్లు ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 17,881 ఓట్లు వచ్చాయి. రాజంపేట వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెనుకపడ్డారు. ఇక్కడ నల్లారి కిరణ్ 1336 ఓట్ల లీడ్‌తో ఉన్నారు.

News June 4, 2024

కుప్పంలో భరత్ వెనుకంజ

image

కుప్పం కౌంటింగ్‌కు సంబంధించి తొలిరౌండ్‌లోనే వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకపడ్డారు. పోస్టల్ ఓట్లలో భరత్ కన్నా చంద్రబాబు 1549 ఓట్లు ఎక్కువగా సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తొలిరౌండ్‌లోనే ఆధిక్యం సాధించారు. ఇక్కడ లక్ష మెజార్టీ సాధిస్తామని టీడీపీ చెబుతోంది.

News June 4, 2024

ఇంటి నుంచే ఫలితాలపై పెద్దిరెడ్డి ఆరా..!

image

చిత్తూరు జిల్లా ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలువురు వైసీపీ నాయకులు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఆయన ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో పలువురు నాయకులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.

News June 4, 2024

తిరుపతిలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూములు

image

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూము తలుపులు తెరుచుకున్నాయి. పూర్తిస్థాయి సీసీ కెమెరాలు, వీడియో, ఫోటో రికార్డింగ్ నడుమ ఓపెన్ చేశారు. మరికాసేపట్లో ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్లు లెక్కిస్తారు.

News June 3, 2024

బి.కొత్తకోట: విద్యుత్ వైర్లు తలకు తగిలి రైతు దుర్మరణం

image

విద్యుత్ వైర్లు తలకు తగిలి రైతు దుర్మరణం చెందిన విషాదకర ఘటన బి.కొత్తకోట గట్టులో జరిగింది. సీఐ సూర్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని గట్టు గ్రామానికి చెందిన రైతు రామస్వామి (60) రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్దకు పాడి ఆవులను తోలుకుని వెళ్లాడు. సాయంత్రం చీకటి పడుతుండడంతో ఆవులను తొలుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోని, అయ్యవారితోపు వద్ద కరెంటు వైర్లు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 3, 2024

చిత్తూరు: చిరుత సంచారం..?

image

కార్వేటినగరం: చింతమండి,ఎంఎం విలాసం(P)ల పరిధిలో చిరుత సంచరిస్తున్నట్టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చింతమండి గ్రామానికి సమీపంలో గల పంట పొలాల్లో చిరుత సంచరించినట్టు పాద గుర్తులు గుర్తించారు. పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. రెవిన్యూ అధికారులతో పాటు అటవీ, పోలీసు అధికారులు పులి పాద ముద్రలను పరిశీలించారు. ఒంటరిగా అటవీ సమీప ప్రాంతాల్లోకి వెళ్లోద్దని హెచ్చరించారు.

News June 3, 2024

చిత్తూరు: కౌంటింగ్ ఏర్పాట్లు సమీక్షించిన ఐజి

image

ఎస్వి సెట్‌లో మంగళవారం జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లను చిత్తూరు, తిరుపతి జిల్లాల కౌంటింగ్ ఇన్చార్జి, ఐజి మోహన్ రావు సమీక్షించారు. కౌంటింగ్ గదులను అధికారులతో కలిసి పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు. కాలేజీ పరిసరాలు, పార్కింగ్, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూములు, మీడియా పాయింట్ పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ మణికంఠ ఉన్నారు.