Chittoor

News June 1, 2024

రోజా ఓడిపోబోతుంది: ఆరా

image

ఈసారి ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి ఖాయమని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో ఆమె స్పల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. తాజా ఎన్నికల్లో పరాజయం తప్పదని ఆరా చెప్పడంతో.. పరోక్షంగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాను అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 1, 2024

SVU: డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష వాయిదా

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) 5, 6 ఇన్‌స్టంట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 4న పరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. 4న ఆయా పరీక్షా కేంద్రాలలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 1, 2024

తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పర్యవేక్షణ అధికారిగా మోహన్ రావు

image

ఏపీలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు పదిమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు పర్యవేక్షణ అధికారిగా K.V. మోహన్ రావును నియమించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు ఐపిఎస్ ఆఫీసర్ల నియామకం చేపట్టారు.

News June 1, 2024

ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్ ?

image

తిరుపతి జిల్లా ఏర్పేడు సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ అయ్యిందని సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంటలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 1, 2024

తిరుమల శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్ సీఎం

image

తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు.

News June 1, 2024

తిరుపతి: బీ-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

రెండేళ్ల బీ-ఫార్మసీ (2024-25) ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వై.ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. బైపీసీ, ఎంపీసీ చదివిన విద్యార్థులు https://apsbtet.in/pharmacy వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 70367 25872 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News June 1, 2024

చిత్తూరు: 2న క్రికెట్ జట్ల ఎంపిక

image

చిత్తూరు జిల్లా బాయ్స్, గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో 2024-25 సీజన్ కు సంబంధించి అండర్-16 (బాలుర), అండర్-23 (పురుషులు) క్రికెట్ జట్ల ఎంపికలు ఈ నెల 2న నిర్వహించనున్నట్లు కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని మైదానంలో ఉదయం ఎనిమిది గంటలకు బాలురకు, మధ్యాహ్నం రెండు గంటలకు పురుషులకు ఎంపిక జరుగుతాయన్నారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. చిత్తూరు జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం చిత్తూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

పీలేరులో వివాహిత ఆత్మహత్య

image

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు మండలంలోని రేగళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేగళ్లుకస్పాకు చెందిన పూజారాజ భార్య రామాంజుల కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

News June 1, 2024

ప్రజలు అపోహలను నమ్మొద్దు: DSP ఉమామహేశ్వర రెడ్డి

image

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఫలితాలు, అపోహలను ప్రజలు నమ్మొద్దని శ్రీకాళహస్తి డి.ఎస్.పి ఉమామహేశ్వర రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

error: Content is protected !!