India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి చిత్తూరులో వైసీపీకి 6-7, ఎన్డీఏ కూటమికి 7-8 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు చిత్తూరు, తిరుపతి ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది. దీంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొనగా.. జూన్ 4న తుదిఫలితాలు వెల్లడికానున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకు గాను కూటమి 7, వైసీపీ 4, మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉండబోతుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కేకే సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకు గాను కూటమి 10, వైసీపీ 3, ఒకచోట జనసేన గెలవనుందని కేకే సర్వే పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.
బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అక్కడి నుంచి గెలుస్తారని చెప్పకనే చెప్పింది. అలాగే పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి భారీ విజయం సాధిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి..?
తిరుపతి జిల్లాలో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రౌండ్ల వివరాలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు-21రౌండ్లు, సూళ్లూరుపేట-22రౌండ్లు, వెంకటగిరి-22రౌండ్లు, తిరుపతి-20 రౌండ్లు, శ్రీకాళహస్తి-21రౌండ్లు, చంద్రగిరి-20రౌండ్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 2,231మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5గంటల్లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈసారి ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి ఖాయమని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో ఆమె స్పల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. తాజా ఎన్నికల్లో పరాజయం తప్పదని ఆరా చెప్పడంతో.. పరోక్షంగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాను అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) 5, 6 ఇన్‌స్టంట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 4న పరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. 4న ఆయా పరీక్షా కేంద్రాలలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు పదిమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు పర్యవేక్షణ అధికారిగా K.V. మోహన్ రావును నియమించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు ఐపిఎస్ ఆఫీసర్ల నియామకం చేపట్టారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ అయ్యిందని సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంటలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు.
Sorry, no posts matched your criteria.