Chittoor

News April 5, 2024

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

చిత్తూరు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్‌ను నూతన ఎస్పీ మణికంఠ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీగా విజయ్ మణికంఠ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News April 5, 2024

తిరుపతి IITలో ఉద్యోగాలకు నేడు చివరి తేదీ

image

ఏర్పేడు సమీపంలోని తిరుపతి IITలో సీనియర్ రీసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్టు అసిస్టెంట్-01 పోస్టుల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. యూజీ, పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, గేట్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.

News April 5, 2024

వీళ్లే నా స్టార్ క్యాంపెయినర్స్: జగన్

image

తిరుపతి జిల్లాలో నిన్న CM జగన్ బస్సు యాత్ర జరిగింది. రేణిగుంట నుంచి ఆయన యాత్ర ప్రాంభం కాగా దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలను కలిశారు. కూలీలు, వృద్ధులతో మాట్లాడారు. ఆయనతో పలువురు సెల్ఫీ దిగారు. ‘వీళ్లే నా స్టార్ క్యాంపెయినర్స్’ అంటూ సంబంధిత ఫోటోలను జగన్ ట్విటర్(X)లో పోస్ట్ చేశారు. నిన్నటి కార్యక్రమంలో CM వెంట తిరుపతి MP గురుమూర్తి, శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

News April 5, 2024

చిత్తూరు: రేపు షబ్‌-ఎ-ఖదర్‌ జరుపుకోండి

image

రంజాన్‌ ఉపవాసాల చివరివారం సందర్భంగా శనివారం జిల్లాలోని ముస్లింలు షబ్‌-ఎ-ఖదర్‌ పండుగను జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా జుహూరి జునైది ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి ముస్లింలు భక్తి ప్రపత్తులతో సమాజ శ్రేయస్సు కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. షబ్‌-ఎ-ఖదర్‌ సందర్భంగా ధనికులైన ముస్లింలు పేదలకు కనీసం 2.2కిలోల గోధుమలు లేదా వాటికి సరిపడా ధనం వితరణ చేయాలని సూచించారు.

News April 5, 2024

CTR: న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ

image

చిత్తూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను నెల్లూరు జిల్లాలోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్)గా నియమిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న అడిషనల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) వెన్నెలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

News April 5, 2024

9న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

News April 4, 2024

తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్.. చిత్తూరు ఎస్పీగా మణికంఠ

image

చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా 2018..IPS బ్యాచ్‌కి చెందిన మణికంఠ చందోలును నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ ఎస్పీగా ఆరిఫుల్లా విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌ని నియమించింది.

News April 4, 2024

చౌడేపల్లిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

చౌడేపల్లి పట్టణంలోని బజారు వీధిలోని ఓ ఇంట్లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం.. స్థానిక ఉన్నత పాఠశాలలో సాయి రితీష్ (14) అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన పుస్తకాలు ఉన్న బ్యాగుతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి హేమ కళ్యాణి స్థానిక సచివాలయ ఉద్యోగిగా ఉంది. సాయి రితీష్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

తిరుమల: రేపు డయల్ యువర్ ఈవో

image

టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో ఫోన్లో(0877-2263261) నేరుగా మాట్లాడి తెలపవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2024

తిరుపతి జిల్లా సిద్ధమా..?: జగన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. నిన్న పూతలపట్టులో సభ అనంతరం ఆయన తిరుపతి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ తిరుపతి జిల్లాలో డ్రైవర్లతో సమావేశం అవుతారు. అలాగే రోడ్ షోతో పాటు నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుంది. ఈక్రమంలో సీఎం జగన్ ‘Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా…?’ అని ట్వీట్ చేశారు.