India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూం భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 24 గంటలూ ఈవీఎంల రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి అక్కడే మృతిచెందారు. పీలేరు పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన షేక్షావలి కువైట్ వెళ్లారు. అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందారు. అతని మృతదేహాన్ని పీలేరుకు బుధవారం తీసుకొచ్చారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు బుధవారం ముగిశాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం వేంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లాలో జరిగిన అల్లర్లపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. దాడులకు పాల్పడిన వారితో పాటు పాత నేరస్థులపై రౌడీషీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేయనుందట. ఇప్పటికే 57 మందిని గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. త్వరలో మరికొందరి వివరాలు సేకరించి దాదాపు 100 మందిపై రౌడీషీట్ తెరుస్తారని తెలుస్తోంది.
చిత్తూరు నియోజకవర్గంలో ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 3 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు జేసి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జూన్ 4 వ తేదిన ఉదయం 6 గంటలకల్లా ఏజెంట్లు ఎస్వి సెట్ కళాశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
మామిడి పండ్లకు మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కుప్పం ప్రాంతంలో వేల ఎకరాలలో బంగినపల్లి, తోతాపురి, నీలం, చందూరా తదితర రకాల మామిడికాయలు సాగు చేస్తున్నారు. బంగినపల్లి టన్ను 42 వేల నుంచి 50 వేలు, చందూరా రకం 30 వేల నుంచి 40 వేలు వరకు ధర పలుకుతోంది. క్రిమి సంహారక మందుల ఖర్చు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు.
భక్తులకు శ్రీవారి VIP బ్రేక్ దర్శన టికెట్ల స్థానంలో నకిలీ దర్శన టికెట్లను అంటగట్టి మోసగించాడు తిరుపతికి చెందిన రఘు సాయి తేజ అనే దళారీ. ఆయన వద్ద టికెట్లను తీసుకున్న శ్రీనివాస్ మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్లగా స్కానింగ్ కాలేదు. దీంతో తాము మోసపోయామని భక్తులు గుర్తించారు. వెంటనే విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నివేదిక ఆధారంగా తిరుమల వన్ టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కుప్పం మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలలుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సంతోష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై ఆయన స్పందించకపోవడంతోపాటు మద్యం సేవించి విధులకు హాజరుకావడం, పారిశుద్ధ్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంపై చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు.
ప్రమాదవశాత్తు కారు డోర్ ఓపెన్ కావడంతో ఒకరు చనిపోయారు. మదనపల్లె తాలుకా ఎస్ఐ రవికుమార్ వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరానికి చెందిన తమిళ సెల్వం(60) మదనపల్లెలోని బంధువుల ఇంటికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో 150వ మైలు వద్ద కారు డోరు ఉన్నట్లుండి ఓపెన్ అయ్యింది. దీంతో సెల్వం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు.
Sorry, no posts matched your criteria.