India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లెలో పర్యటించనున్నారు. స్థానిక టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజంపేట MP మిథున్ రెడ్డి, మదనపల్లె అసెంబ్లీ వైసీపీ MLA అభ్యర్థి నిస్సార్ అహ్మద్ లతో కలిసి పలువురు YCP నాయకులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు
వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
విశాఖలో ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తిరుపతికి తరలించారు. విశాఖ జిల్లాలో మరణించిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో కిమ్స్‌లో సర్జరీ చేసి అవయవాలను ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 4 నిమిషాల్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఛార్డెర్డ్ ఫ్లైట్‌లో రేణిగుంటకు తరలించారు.
1911, ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నేటితో 113 ఏళ్లు పూర్తి అయింది. ఏపీలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో కాణిపాకం, తిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జిల్లాలు విడిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ఇద్దరు మాజీ సీఎంలు, ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న పట్టించుకోలేదు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలను అహోబిల మఠం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఖండించారు. తిరుమల స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఎన్నడూ ధర్మారెడ్డి తమ పీఠానికి రాలేదని చెప్పారు. అహోబిలం పీఠాధిపతి శ్రీశైలం గుహల్లో గుప్తనిధుల కోసం ప్రయత్నించారనే ఆరోపణలతో అప్పట్లో ఓ వీడియో వైరల్ అయ్యింది.
తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. చంద్రగిరి నియోజకర్గం రామచంద్రపురం మండలం కొత్త వేపకుప్పం గ్రామానికి చెందిన మణి కుమారుడు బాలు గుండెపోటుతో చనిపోయాడు. విద్యార్థి నిన్న రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తిరుపతిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమలో చనిపోయాడు.
పేకాట ఆడుతూ పట్టుబడ్డ కానిస్టేబుల్‌ను తిరుపతి జిల్లా SP కృష్ణకాంత్ పటేల్ సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం(M) కొల్లాగుంటలోని ఓ మామిడి తోటలో పేకాట ఆడారు. పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పూర్ణచంద్రరావు ఉన్నారు. జూదాన్ని అడ్డుకోవాల్సిన పోలీసే ఇలా చేయడంతో SP సీరియస్ అయ్యారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తిరుపతి IISERలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్-ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ), బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఇతర వివరాలకు www.iiseradmissiఓn.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 13.
ఓటరు గుర్తింపు కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్తూరు కలెక్టర్ ఎస్.షన్మోహన్ కోరారు. ఎపిక్ కార్డు లేని వారు ప్రత్యామ్నాయంగా ఫోటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆధార్ కార్డ్, ఉపాధి హామీ కార్డ్, బ్యాంక్/ పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్‌లు లాంటి 12 రకాల కార్డులు చూపించి ఓటు వేయవచ్చని సూచించారు.
ప్రస్తుత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలపై అందరి దృష్టి నెలకొంది. YCPలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. తరచూ కుప్పంలో పర్యటిస్తూ బాబుకు సవాల్ విసురుతున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ కావడంతో పెద్దిరెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.