India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో చిత్తూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, SRపురంలో 41.4, తవణంపల్లె, నగరిలో 41.1, బంగారుపాళ్యం, పలమనేరులో 41, గుడుపల్లెలో 40.6, పుంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంపిచెర్ల, చౌడేపల్లెలో 39.1 డిగ్రీలు నమోదైంది.
కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు చెరువులో దిగిన ఓ గిరిజన వివాహిత నీట మునిగి మృతి చెందింది. ఈ ఘటన వరదయ్యపాళెంలో శనివారం చోటుచేసుకుంది. పవన్, నాగరాణి దంపతులు శుక్రవారం సాయంత్రం కాలనీ సమీపంలోని చెరువులో సరదాగా ఈత కోసం దిగారు. భర్త పవన్ చెరువు ఒడ్డున దుస్తులు ఆరబెడుతుండగా.. ఈత రాకపోవడంతో నాగరాణి(40) నీట మునిగి శవమై తేలింది. వీరికి నలుగురు సంతానం. ఘటన పై కేసు నమోదు చేశారు.
మదనపల్లిలో రైతుపై హత్యాయత్నం జరగడం తీవ్రకలకలం రేపుతోంది. పోలీసుల కథనం.. మండలంలోని పాలెంకొండకు చెందిన నాగరాజకు , అదే ఊరిలోని చిన్నప్పకు ఆస్తికోసం గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం పొలం వద్ద ఇరువర్గాలు గొడవపడ్డారు. ఈఘర్షణలో రైతు నాగరాజపై ప్రత్యర్థులు మురళి, చిన్నప్ప, చిన్నక్కలు కొడవళ్లతో నరకడంతో చేతి వేళ్లు కట్ అయ్యాయి, తలకు గాయమైంది. బాధితునికి మదనపల్లెలో చికిత్స చేయించి రుయాకు వెళ్లారు.
ప్రియురాలు ప్రేమను నిరాకరించిందని విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బి.కొత్తకోట కాండ్లమడుగు క్రాస్, ఈడిగపల్లికి చెందిన నవీన్ టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నవీన్ ఓ అమ్మాయిని ప్రేమించగా.. నిరాకరించడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు బాధితుణ్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించగా కోలుకుంటున్నాడు.
కుటుంబ కలహాల కారణంగా గన్నేరు పప్పు తిని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనబంగారుపాలెం మండలం వెంకటాపురంలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. వెంకటాపురానికి చెందిన రఘు (50) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో మన స్థాపం చెంది గన్నేరు పప్పు తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులపై వడ్డీ మాఫీకి ఆదివారం ఆఖరు రోజు అని, ఈ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ డా. జె అరుణ కోరారు. పన్ను బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ఉంటుందన్నారు. ఆదివారం రోజైనా నగరపాలక కార్యాలయంలోని పురసేవ కేంద్రం పనిచేస్తుందన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడిపై కలెక్టరేట్లో శనివారం సంభందిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పట్టణాల్లో, గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చూడాలని చెప్పారు.
తిరుమల మొదటి ఘట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏనుగులు అర్చ్ దాటిన తర్వాత ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి కారులో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలకు గాయాలు కాగా.. అశ్వినిని ఆసుపత్రికి తరలించారు. ఈవో ధర్మారెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బిఎడ్ (B.Ed), బిఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులో ఖాళీగా ఉన్న 51 సీట్లుకు, ఏప్రిల్ మూడో తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని పేర్కొన్నారు. APED CET- 2023 అర్హత పొంది ఏ కళాశాలలో అడ్మిషన్ పొందనివారు స్పాట్ అడ్మిషన్లకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లిలో మాజీ సీయం కిరణ్ కూమార్ రెడ్డి సోదరుడు, పీలేరు టీడీపీ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ రెడ్డితో వేదికను పది సంవత్సరాల తర్వాత పంచుకున్నారు. బీజేపీ కార్యాలయంలో కలిసిన అనంతరం సొంత ఇంటికి వెళ్లడంతో వారి అనుచరులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా కిరణ్ కూమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.