India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మదనపల్లికి ఏప్రిల్ 2న సీఎం జగన్ రానున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి ‘మేము సిద్ధం ‘బహిరంగ సభకోసం టిప్పు సుల్తాన్ మైదానం శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ మిథున్ రెడ్డి వెంట ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ మహమ్మద్, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, షమీం అస్లాం తదితరులు ఉన్నారు.
కుప్పం పట్టణంలోని డాక్టర్ వైసీ జేమ్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ( PolyCET) – 2024 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథం పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హులన్నారు.
తిరుపతి నగరం జీవకోనలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం ఎన్నికల నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ దుకాణంలో ఆయన స్వయంగా దోశలు వేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్తూరు: యువ ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. 2019లో 85.02% పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. 2024లో వంద శాతం నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టామన్నారు.
తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. తాళ్లపాకలోని ధ్యానమందిరం, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4న తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరుగుతుంది. ఏప్రిల్ 5న తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారు.
జనసేన తిరుపతి MLA అభ్యర్థి శ్రీనివాసులును వ్యతిరేకిస్తున్న ఆపార్టీ స్థానిక ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మంగళగిరిలో నాగబాబును గురువారం కలిశారు. తిరుపతిలో తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. త్వరలో తిరుపతిలో పవన్ పర్యటన ఉంటుందని.. ఈ లోపు పరిస్థితులు అంతా చక్కదిద్దుకుంటాయని నాగబాబు ఆయనకు సూచించారు. ఎన్నికల్లో తనకు కీలక బాధ్యతలు ఇవ్వాలని నాగబాబును కోరగా.. అందుకు ఆయన అంగీకారం తెలిపారని కిరణ్ రాయల్ చెప్పారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం జరగనుంది. ఈక్రమంలో ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
నగరిలో రోజాకు అసమ్మతి నేతల తలనొప్పి తగ్గడం లేదు. YCP పెద్దల పిలుపుతో 5 మండలాల నాయకులు అమరావతి వెళ్లారు. రోజా కోసం అందరూ కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించారు. ‘మేము వద్దన్నా రోజాకు టికెట్ ఇచ్చారు. అందరూ కలిసి పని చేసినా ఆమె ఓడిపోతారు. తర్వాత మేమే ఓడించాం అని ఆమె ప్రచారం చేస్తారు. ఆ నిందలు మాకెందుకు’ అని నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. తర్వాత వారికి రోజా నమస్కారం చేసినా నేతలు ముఖం చాటేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గరిష్టంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.300 వేతనం అందేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ శన్మోహన్ తెలిపారు. కూలీలు పనిచేసిన పని పరిమాణాన్ని 300 రూపాయలకు మించకుండా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వందరోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
తిరుమల కాలినడక మార్గంలో మరోసారి చిరుత కదలికలు టీటీడీ, ఫారెస్ట్ అధికారుల మధ్య కలకలం సృష్టించింది. ఈనెల 25, 26 వ తేదీలలో కాలినడక మార్గంలో చిరుత జాడలను గుర్తించినట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాలినడకన మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.