India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతిలో టీడీపీ నేత కోడూరు బాలసుబ్రమణ్యం ఇంట్లో 15 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఆయన మాట్లాడుతూ.. 15 మంది అధికారులు తమ ఇంట్లో సోదాలు చేయడం బాధాకరమన్నారు. తమ లాంటి వ్యక్తులపైనే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
వైసీపీ అధికారికంగా కొనుగోలు చేసిన ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నిమిత‍్తం పార్టీకి అవసరమైన సామగ్రిని 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 14వ తేదీ వరకు వివిధ తేదీల్లో పలు సంస్థల నుంచి జీఎస్‌టీ చెల్లించి మరీ కొనుగోలు చేసినట్లు చెప్పారు.
డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మేనల్లుడు డి.రమేష్ బాబు వైసీపీని వీడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగతానని చెప్పారు.
పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్‌లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చంద్రబాబు కుప్పం పర్యటనపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పందించారు. ‘భయం అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు కుప్పంలో ఒక్కరోజూ ప్రచారం చేయకుండా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతున్నాడు. కారణం కుప్పంలో జగన్ గారు చేసిన అభివృద్ధి. కుప్పం ప్రజలు ఈసారి వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు అనే నిజానికి చంద్రబాబు భయపడ్డాడు’ అని ఆయన ట్వీట్ చేశారు.
తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ రమణ కొడుకు పి.చరణ్(16)ను పది పరీక్షలు రాయడానికి బైక్‌పై తీసుకెళ్తుండగా మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన చరణ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. CI. శ్రీరామశ్రీనివాస్ కథనం మేరకు.. మండలంలోని వికృతమాలకు చెందిన ఓ కుటుంబం నుంచి పుత్తూరు మండలంలోని వేణుగోపాలపురానికి చెందిన సురేంద్ర కొంతకాలం కిందట నగదు తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించాలని మహిళ అడిగినందుకు ఇంట్లో భర్త లేని సమయంలో అశ్లీల చిత్రాలను చూపించి లైంగికంగా వేధిస్తున్నాడన్నారు.
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఐదుగురు అనుచరులపై ఎన్నికల కోడు ఉల్లంఘన కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో పలమనేరు రోడ్డులో బస్టాండ్ ప్రాంతంలో సమావేశానికి అనుమతి తీసుకుని.. ప్రైవేటు బస్టాండ్‌లో సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘించారని ఆయన చెప్పారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వంటి కారణాలతో కేసు నమోదు చేశామన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని డిగ్రీ/ ఓరియంటల్, జూనియర్ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికగా లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల గడువు బుధవారంతో ముగుస్తుంది. డిగ్రీ లెక్చరర్స్ -49, జూనియర్ లెక్చరర్స్-29 మొత్తం …78 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 27.
తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసిన ఘటన ఐరాల మండలంలో జరిగింది. నాగంవాండ్లపల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన చలపతి కుమారుడు సంతోశ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుుతున్నాడు. అనారోగ్యంతో చలపతి మంగళవారం మృతి చెందాడు. ఒకపక్క తండ్రి మరణం.. మరోపక్క పరీక్ష. తండ్రి మరణాన్ని దిగమింగి ఉదయం జరిగిన జీవశాస్త్ర పరీక్షను రాసి అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
Sorry, no posts matched your criteria.