India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజాగళం పేరుతో మాజీ సీఎం, TDP అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కుప్పం నుండి బయలుదేరి 9:30 గంటలకు పలమనేరు చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. తదుపరి మధ్యాహ్నం 2:30 గంటలకు పుత్తూరుకి, సాయంత్రం 4:30 గంటలకు మదనపల్లె బెంగళూరు బస్ స్టాండు వద్దకు చేరుకుంటారు. విందులో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
చిత్తూరు జిల్లా వి.కోట మండలం కంబార్లపల్లి పంచాయతీ పరిధిలోని 14 మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీవోకు రాజీనామా పత్రాలు సమర్పించారు. తాము రానున్న ఎన్నికల్లో వైసీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడ విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. సీఎం జగన్ చొరవతో లబ్ధిదారులకు గత ఐదేళ్లుగా సేవలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు.
శ్రీక్రోధినామ సంవత్సర పంచాంగాన్ని మంగళవారం నుంచి టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. ఏటా లాగానే నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని టీటీడీ ముద్రించింది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో త్వరలో టీటీడీ అందుబాటులోనికి తీసుకు రానుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌లో జరగనున్న విశేష పర్వదినాలు ఇలా ఉంటాయి. 5న శ్రీ అన్నమాచార్య వర్ధంతి, 7న మాస శివరాత్రి, 8న సర్వ అమావాస్య పూజలు చేశారు. 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, 11న మత్స్యజయంతి జరుగుతుంది. 17న శ్రీరామనవమి ఆస్థానం, 18న శ్రీరామపట్టాభిషేక ఆస్థానం, 19న సర్వ ఏకాదశి, 21 నుంచి 23వ తేదీ వరకు వసంతోత్సవాలు నిర్వహిస్తారు.
జనసేన నేత గంటా నరహరి వైసీపీలో చేరారు. గతంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా పని చేసిన ఆయన ఈనెల 13న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నరహరితో చర్చించారు. ఇవాళ CM క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో YCP తీర్థం పుచ్చుకున్నారు.
రామకుప్పం వద్ద హంద్రీనీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పానికి నీళ్లు రావడం గ్రాఫిక్స్‌లా ఉందన్నారు. ఉత్తుత్తి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే కనిపించిన నీరు ఇప్పుడు కనబడటం లేదని విమర్శించారు. మరి ఇంత మోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని హంద్రీనీవా నీళ్లు ఇచ్చినట్లు షో చేశారని మండిపడ్డారు.
ఏపీని కాపాడాలన్న అజెండాతోనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో ఆయన సమావేశమయ్యారు. ‘ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. వాలంటీర్లు రూ.30 వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తా’ అని చంద్రబాబు తెలిపారు.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన ఘటన సోమవారం చిన్నగొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అలసిపోయిన తల్లి గుడిసెలో నిద్రిస్తుండగా అదే ఇటుకల బట్టీలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన వేలు అనే యువకుడు చిన్నారిని పక్కనే ఉన్న గుడిసెలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతలో తల్లి నిద్ర లేచి గుడిసెలోకి వెళ్లి చూడగా నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి
మృతి చెందిన ఘటన తొండవాడ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్ కు చెందిన రహదేవ్ సింగ్(26) చంద్రగిరిలో కూలీగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో వస్తుండగా పెట్రోల్ లేకపోవడంతో ఆగిపోయింది. దీంతో రహదేవ్ సింగ్ పెట్రోల్ పట్టించుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి మంగళవారం తిరుమలకు రానున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో సాయంత్రం నాలుగు గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరి రాత్రి బస చేయనున్నారు. బుధవారం రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. విమానాశ్రయానికి అభిమానులు చేరుకోవాలని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు ప్రభాకర్ కోరారు.
Sorry, no posts matched your criteria.