India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదవ తరగతి సప్లి మెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3 వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ దేవరాజు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. 2006 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్టు హైదరాబాద్‌కు చెందిన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ దీపాపైస్వాల్ , డాక్టర్ ఎస్.ఎస్.జాదవ్, డాక్టర్ కరుతపాండి శుక్రవారం తెలిపారు. శ్రీలంక తడి భూముల్లో మనుగడ సాగిస్తున్న బ్యాక్డ్ ప్రాగ్‌గా గుర్తించామన్నారు.
చిన్నమండెం మండలం, గుట్టు సమీపంలోని మొటుకు అడవిలో ఓ మహిళను ఉరివేసి చంపిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్రంకొండ మండలం తుమ్మల గొంది సమీపంలోని మొటుకు అడవిలో సుమారు 25 ఏళ్ల వయసున్న ఓ గుర్తు తెలియని యువతిని ఎవరో అడవిలోకి తీసుకెళ్లి పథకం ప్రకారం ఉరేసి చంపేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు చెబుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు పట్టణంలోని ముత్తిరేవుల వద్ద ఎస్‌వి సెట్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలలో ఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని సూచించారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని అధికారులను సూచించారు.
వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి గురువారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి రోజా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాసేపు ఎమోషనల్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా పాకాలలో ఏనుగు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. వారం క్రితం అరగొండ సమీపంలో ఒకరిని ,వెంగంపల్లి వద్ద మరొకరిని ఈ ఏనుగు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఏనుగు కోసం అటవీ అధికారులు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏనుగు ఎప్పుడు ఏ ప్రాంతంలోకి చొరబడుతుందో అని ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నందు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య (ఆన్ లైన్) విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://ignouadmission.samarth.edu.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.
తిరుమల శ్రీవారి లక్ష్మీహుండీ చోరీ చేసిన కేసులో నిందితునికి మూడునెలల జైలుశిక్ష, రూ. 100 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయ మూర్తి పల్లపోలు కోటేశ్వరరావు గురువారం తీర్పు వెలువరించారు. తమిళనాడుకు చెందిన ఆర్ముగం ఈఏడాది మార్చిలో తిరుమల శ్రీవారి లక్ష్మీ హుండీలో రూ.8,230 చోరీ చేశారు. తితిదే విజిలెన్సు అధికారులు పట్టుకుని నిందితున్ని తిరుమల ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.
వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి గురువారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి తల్లి రోధిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. తన పిల్లలు చనిపోలేదంటూ..వారిని ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ అందిరి కాళ్లూ పట్టుకుంటున్న వైనం హృదయాలని కలచివేస్తోంది. తమకింకెవరూ లేరు అంటూ తామూ చనిపోతామని గుండెలను బాదుకుంది.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో జరిగిన ఘటనను ఈసీ తీవ్రంగా పరిగణించింది. SPని బదిలీ చేయడంతో పాటు నలుగురిపై వేటు వేసింది. తిరుపతి DSP సురేంద్ర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ తిరుపతి DSP భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.రాజశేఖర్, అలిపిరి CI ఓ. రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీలో జరిగిన దుండగుల దాడిలో పులివర్తి నానికి గాయాలైన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.