India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ పరిధిలో ఆదివారం ఒకరోజే రూ. 3 కోట్లు బిల్లులు వసూలయ్యాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం సెలవురోజు బిల్లుల వసూలు కేంద్రాలు యధావిధిగా పనిచేశాయన్నారు. సోమవారం కూడా ఈ కేంద్రాలు పనిచేస్తాయని, వినియోగదారులు ఉపయోగించు కోవాలని చెప్పారు. వంద శాతం బిల్లుల వసూళ్లకు ఇంజినీర్లు, అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.
మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన బీఎన్ కండ్రిగ మండలంలో చోటుచేసుకుంది. SI ప్రతాప్ వివరాల ప్రకారం.. కంచనపుత్తూరునకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడైన బాలమురుగయ్య (26) మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంలో నివాసముంటూ వరదయ్యపాళెం SBI ఎదురుగా నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్క హత్యకు గురికాగా మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బీజేపీ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గూడూరు MLA వర ప్రసాద్‌కి.. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ CM నల్లరి కిరణ్‌కుమార్ రెడ్డికి సీటు కేటాయించింది. తిరుపతి YCP అభ్యర్థిగా ఎం.గురుమూర్తి, రాజంపేట అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా అరణి శ్రీనివాసులుకి సీటు కేటాయించారు.
పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన షేక్ మహమ్మద్ ఆలీని రాష్ట్ర వైసీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి మహమ్మద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూన్ నెల రూ.300 ప్రత్యేక దర్శన కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.
గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు బీజేపీలో చేరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ ఆయనకు సీటు నిరాకరించింది. బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి ఎంపీ సీటు రేసులో ఉన్నారు.
జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. తిరుపతి సీటుపైనే స్తబ్దత నెలకొంది. చిత్తూరు MLA శ్రీనివాసులును తిరుపతి అభ్యర్థిగా ప్రతిపాదించగా జనసేనతో పాటు TDP నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నిన్న జనసేన నాయకులు నాగబాబును కలిసి చర్చించారు. లోకల్‌గా ఉన్న తనతో పాటు TDPలోని ఇద్దరు నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామని తిరుపతిలో కీలకంగా ఉన్న జనసేన నాయకుడు చెప్పినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లా సదుం మండలం ఊటుపల్లె సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. B.గురుమూర్తి, ఎం.ఈశ్వ రయ్య, కె.బాలాజీ ఈనెల 19న వైసీపీ నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీసీవై పార్టీ నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో వివరించారు.
చంద్రబాబుతో విభేదించి ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. చిత్తూరు ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. దీంతో చంద్రగిరి నుంచి ఇండిపెండెంట్ MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ MLAగా 14,392 ఓట్ల మెజార్టీతో గెలిచారు. TDP అభ్యర్థి రామనాథం నాయుడుకు 32,2446 ఓట్లు పడ్డాయి. రామ్మూర్తికి ఏకంగా 31,525 ఓట్లు రావడంతో అక్కడ TDP ఓడిపోయింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు ఆది, సోమవారాలు యథావిధిగా పనిచేస్తాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.