India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లాలో లైసెన్స్ కలిగిన 697 తుపాకులను పలువురు కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో స్థానిక పోలీసు స్టేషన్ల ద్వారా 624 డిపాజిట్ చేయించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. మిగిలిన 73 తుపాకులు బ్యాంకుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తీసుకెళ్లే సెక్యూరిటీ ఏజెన్సీ వారివి కావడంతో మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన నిర్వహించారు. వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్సై షేక్షావల్లి, టూ టౌన్ సిఐ ఉలసయ్య , ఎస్సై ప్రసాద్ పోలీసు సిబ్బంది నగరంలోని పలు ప్రధాన క్రీడలలో కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో గొడవలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం.. మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లిలో అనుమతి లేకుండా నిసార్ అహ్మద్ రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (mmc) అధికారి, నిమ్మనపల్లి ఇన్చార్జ్ ఎంపీడీవో చలపతిరావు ఫిర్యాదుతో నిస్సార్ అహ్మద్ పై కేసు నమోదు చేశారు.
చెరువులో దూకి భవన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం మదనపల్లి మండలంలో చోటుచేసుకుంది. తాలూకా సిఐ ఎన్ శేఖర్ కథనం మేరకు.. బసినికొండ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న కొండయ్య (37) వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. శనివారం బసినికొండ పొంతల చెరువులోని నీటిపై మృతదేహం తేలియాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొండయ్య మృతదేహాన్ని వెలికి తీశారు.
ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఎంటెక్(M.Tech), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ(MPP) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 19.
చంద్రబాబు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు వద్ద కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులివర్తి నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంత్రి నివాసంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సమావేశం అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 2న పీలేరు, 3న చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర, నాయకులతో సమావేశం, 4న తిరుపతి జిల్లాలో బస్సు యాత్ర.. శ్రీకాళహస్తి లేదా నాయుడుపేటలో నాయకులతో సమావేశం జరుగుతుందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 25న సోమవారం జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో పీఈఏస్ వైద్య కళాశాలకు ఆయన చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి అనంతరం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పలువురు నాయకులను కలిసి మద్దతు కోరారు. ఆ మరుసటి రోజు టీడీపీ, జనసేన అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు ఎస్సీవీ నాయుడు సైతం తాను సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కూటమి సహకారం లేకుండా విజయావకాశాలు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మండలంలోని పెనుమల్లం, రావిళ్లవారి కండ్రిగకు చెందిన ఇద్దరు వాలంటీర్లను శుక్రవారం విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా వాలంటీర్లు లత, గీత, ఆర్టీసీ కండక్టర్ మురళి పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో వాలంటీర్లను తొలగించడంతో పాటు మురళిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.