India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతికి చెందిన ఎం.మౌనిక దగ్గర ఎం.ఆర్.పల్లికి చెందిన డెంటల్ డాక్టర్ పవిత్ర తన ‘సిరి డెంటల్ కేర్’ అభివృద్ధి కోసం ఏప్రిల్ 15, 2019న రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బుకు పవిత్ర చెక్ ఇవ్వగా బ్యాంకులో డబ్బు లేకపోవడంతో మౌనిక కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో తిరుపతి 2వ కోర్టు పవిత్రకు 6 నెలలు జైలు శిక్ష రూ.5 వేలు ఫైన్ ను గురువారం ఖరారు చేసింది.

పదవుల కోసం దిగజారే మనస్తత్వం తనది కాదని వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ మేయర్, నాలుగో డివిజన్ కార్పొరేషన్ పదవికి ఎప్పుడో రాజీనామా చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామాను గోప్యంగా ఉంచినట్టు కొందరు ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పదవులను పట్టుకొని వేలాడనని తెలిపారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాషాతో సహా 17 మంది వైసీపీ కౌన్సిలర్లు పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రొంపిచర్ల నందు గల ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి చేరారు.

తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ, టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జి హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఆయనకు టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జ్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. అడవుల్లో చేపడుతున్న కూంబింగ్, సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

కంటైనర్ ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చోటు చేసుకుంది. ఎస్సై వీరాంజనేయలు కథనం మేరకు.. సత్యవేడు బీసీ కాలనీకి చెందిన అన్సార్ (37), టి.నీలయ్య (24) తమిళనాడులోని కవర్ పేటలో తాపీ మేస్త్రీ పనులకు వెళ్లారు. తిరిగి బైకులో రాత్రి సత్యవేడుకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొనడంతో అన్సార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నీలయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు మూకుమ్మడిగా బుధవారం రాజీనామా చేశారు. వైసీపీ పాలనలో 2022 జూన్ 4న ఆలయ ఛైర్మన్‌గా భూమిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, పాలక మండలి సభ్యులుగా నాగిరెడ్డి, మంజుల, సురేశ్, మధుసూదనశెట్టి , రాజేశ్వరిలు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వారు తమ రాజీనామా పత్రాన్ని ఈవో ఎ.జయకుమార్‌కు అందించారు.

తిరుపతి సమీపంలోని పేరూరు బండపై ఉన్న శ్రీవకుళామాత ఆలయంలో జూన్ 30వ తేదీ వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం జరగనుంది.

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 30వ తేదీ తన సొంత ఊరికి రానున్నారు. బెంగళూరు నుంచి కలికిరికి చేరుకుంటారు. కలికిరిలోని బీజేపీ కార్యాలయంలో 1, 2, 3వ తేదీల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణప్ప తెలిపారు.

టీడీపీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత తనదేనని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్యకర్తలను ఎంతగా హింసించినా ఆత్మస్థైర్యం కోల్పోలేదన్నారు. పార్టీ కోసం సైనికుల్లా పని చేశారని ప్రశంసించారు.

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 1966 మందికి 1550 మంది పాసయ్యారు. 78.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోనే చిత్తూరు 7వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లాలో 3,100 మందికి 2,195 మంది పాసై 14వ స్థానంలో నిలిచారు. రెండు జిల్లాల్లో అమ్మాయిల పాస్ పర్సంటేజీనే ఎక్కువ కావడం విశేషం. మరోవైపు అన్నమయ్య జిల్లాలో 3,275 మందికి 2,662 మంది పాసై రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
Sorry, no posts matched your criteria.