India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లోనూ ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటలేకపోయారు. తిరుపతి జిల్లాలో 8256 మంది పరీక్షలు రాయగా 3,719 మందే(45శాతం) పాసయ్యారు. రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచారు. చిత్తూరు జిల్లాలో 5,817 మందికి 2,597 మంది ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 5,371 మందికి 2,597 మంది పాసై 46 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచారు.

తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి రోజా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బుధవారం గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ‘కడుపు నిండా బోజనం చేసిన నిండు తల్లులు కడుపునిండి దీవించి వెళ్తుంటే అందులోని సంతోషం ఇంకెక్కడ దొరుకుతుంది. అమ్మల కోసం అమ్మ ప్రేమగా’ అని ఆ ఫోటోలను రోజా ట్వీట్ చేశారు. కాగా ఆమె రెండోసారి గెలిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

డయేరియా సోకి చిన్నారి మృతి చెందిన ఘటన కేవీబీ పురం మండలంలో జరిగింది. చిన్నారి బంధువుల వివరాల మేరకు.. మండలంలోని కాట్రపల్లి దళితవాడకు చెందిన దుష్యంత్, కామాక్షమ్మ దంపతుల కుమార్తె దర్శిని(2)కి డయేరియా వచ్చింది. దీంతో చిన్నారిని శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కాట్రపల్లి ప్రజలు డయేరియా భయంతో వణికిపోతున్నారు.

చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ రోజు పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు కుప్పంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి చేరుకుని ప్రజా వినతులు స్వీకరిస్తారని పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 2:35 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాలలో సమావేశంలో పాల్గొంటారన్నారు.

బెంగళూరులో పనిచేసే ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మదనపల్లె లాడ్జిలో విషంతాగి ఆత్మ హత్యాయత్నంకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు..కేవీ పల్లెకు చెందిన శ్రీనివాసులు(38) బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం స్వగ్రామంవచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు సోమవారం మదనపల్లెకు వచ్చాడు. ఏం జరిగిందో ఏమో ఓలాడ్జిలో బసచేసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అస్పత్రికి తరలించారు.

చిత్తూరు జిల్లాలో నిరుద్యోగం ఓ యువకుడి మృతికి కారణమైంది. స్థానికుల వివరాల మేరకు.. సదుం గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ(25) బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈక్రమంలో పాకాల మండలం వల్లివేడులోని ఓ మామిడి తోటలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నుంచి ఏపీ ఈసెట్- 2024 కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిప్లొమా (ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ బుధవారం నుంచి జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్ డా. వై.ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. వివరాలకు_https://ets. apsche.ap.gov.in చూడాలన్నారు.

విజయవాడ డివిజన్ లోని నిడదవోలు-కడియం సెక్షన్లో నిర్వహణ పనుల కారణంగా తిరుపతి నుంచి రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైలును ఆగస్టు 10,కాకినాడ టౌన్-తిరుపతి (17250) రైలును ఆగస్టు 11,తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ (22708) ను ఆగస్టు 9వరకు, విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ (22707) రైలును 10వ తేదీ వరకు రద్దు చేశారు.

గాజు ముక్క ప్రాణం తీసిన ఘటన శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. CI నరసింహారావు కథనం మేరకు.. పోలి గ్రామంలోని SCకాలనీకి చెందిన బాలాజీ, భార్య ధనలక్ష్మి(32) మధ్య ఆదివారం చిన్నపాటి వివాదం నెలకొంది. ఈనేపథ్యంలోనే బాలాజీ గడ్డం గీసుకుంటున్న సమయంలో కోపంతో చేతిలోని అద్దాన్ని భార్యపైకి విసిరాడు. దీంతో అద్దం గాజు ముక్క ధనలక్ష్మి గొంతుకు తగిలి తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు.

కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కుప్పం డెవలప్మెంట్ అథారిటీ(కడా) ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కడా ఏర్పాటుతో పాటు దీనికి ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తామన్నారు. కుప్పం ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.