India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాళహస్తిలో శుక్రవారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మధుసూధన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తి చేశారన్నారు. వచ్చే ఐదేళ్లలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు గతంలో 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు.
ఎన్నికల ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. ఇన్ని రోజులు అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున స్టార్ క్యాంపెయినర్ల రాకతో చిత్తూరు జిల్లా వార్తల్లో నిలిచింది. ఈ సారి జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలని కూటమి, పట్టు నిలుపుకోవాలని వైసీపీ తహతహలాడుతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.
తపాల శాఖలో బీమా ఏజెంట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తపాలా సీనియర్ సూపరింటెండెంట్ జేఎన్ వసంత ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులను తిరుపతిలోని కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటలలోపు అందించాలన్నారు. ఈనెల 22వ తేదీన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు చెప్పారు.
చిత్తూరు నగరంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు వేసిన వాంటెడ్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ మంగళం శ్రీను ఫొటోను కొందరు ఎడిట్ చేశారు. సునీల్ ఫేస్ బదులు వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానంద రెడ్డిని అందులో ప్రింట్ చేశారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్ ఎం.బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొ
న్నారు. ఎన్నికలు జరిగే 13వ తేదీన ఉద్యోగ, కార్మికవర్గాలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కార్మికులకు సెలవు ఇవ్వకుంటే జరిమానాతోపాటు శిక్షార్హులని పేర్కొన్నారు.
రేణిగుంట వైసీపీ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టణంలోని వంతెన కింద వైసీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు నిత్యం ఇక్కడే ఉంటారు. ఎన్నికల సందర్భంగా అక్కడ తాయిలాలు అందజేస్తున్నట్లు సమాచారం రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సలోని, ఎంపీడీవో విష్ణు చిరంజీవి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేసి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
బీసీ నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి చేశారు. శ్రీకాళహస్తి MLA మధుసూదన్ రెడ్డి, కృష్ణయ్య నిన్న రాత్రి ఏర్పేడులో రోడ్ షో నిర్వహించారు. ఈక్రమంలో ఎవరో విసిరిన రాయి ఎంపీ వీపునకు తగిలింది. అప్రమత్తమైన వైసీపీ కార్యకర్తలు ఎస్ఐ జిలానీకి ఫిర్యాదు చేశారు. తనపై బీసీలు దాడి చేయరని.. ఇది టీడీపీ కుట్రేనని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తిరుపతి: పోలింగ్ రోజున ఉదయం 5 గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ లేదా పక్కన ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ అయి ఉండాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ తప్పనిసరిగా ఎపిక్ కార్డ్ / ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా ఇతర ప్రత్యామ్నాయ పత్రాన్ని కలిగి ఉండాలని తెలిపారు.
కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద గురువారం రాత్రి టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కథనం.. ముదివేడు గ్రామం, సాయిబులపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35), సొంత పనిపై ముదివేడు క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లగా టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితుణ్ని మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు.
తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తిరుపతి ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మీ వెల్లడించారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.
Sorry, no posts matched your criteria.