India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నందు కాంట్రాక్టు ప్రాతిపదికగా రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్ సైట్ చూడగలరు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని కోరారు.

ఈనెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో “మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10గం.ల నుంచి మ.1గం.వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి కమిటీలు, సభ్యత్వాలు పూర్తిగా రద్దు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీల నియామకం, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.

చంద్రగిరి మండల పరిధిలోని కందులవారిపల్లి గ్రామ సమీపంలోని భీమానది కట్టపై గుర్తుతెలియని యువకుడు మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి చేతిపై ధనమ్మ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

చిత్తూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా సుమిత్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన హరియాణా రాష్ట్రం రోహతక్(D) కోనూరులో పుట్టారు. మధ్య తరగతి కుటుంబం కావడంతో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. ఇంజినీరింగ్ తర్వాత ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశారు. 2014లో రెండో ప్రయత్నంలో IASకు ఎంపికయ్యారు. 29 ఏళ్లలోనే నరసాపురం సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. తర్వాత ప్రమోషన్ పొంది కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు.

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావును పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసులు తమను వేధిస్తున్నారని భార్యాభర్త వాపోయారు. మదనపల్లెకు చెందిన నితిన్, హిమజ గతంలో దొంగతనాలు చేశారు. తెలిసో తెలియక తప్పు చేశామని.. ఇప్పుడు తాము మంచిగా బతుకుతున్నామని చెప్పారు. కానీ చేయని నేరాలని ఒప్పుకోవాలంటూ తిరుపతి, కర్ణాటక పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. సమయం, సందర్భం లేకుండా తమను తీసుకెళ్లి గోళ్లు పీకడం, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అమ్మాయి తరపు బంధువులు ప్రేమజంటపై దాడి చేసిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగింది. బాధితుల వివరాల మేరకు.. హిందూపూర్‌కు చెందిన వాణి(21), బి.కొత్తకోట కరెంట్ కాలనీకి చెందిన కార్తికేయ(28) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో నెలక్రితం కదిరిలో వాణి, కార్తికేయ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు బి.కొత్తకోటకు వచ్చి దాడిచేసి గాయపరిచారు. మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.

బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ మణికంఠ శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పలు రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్ కేసులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్షించారు. విలేజ్ పోలీసింగ్ సమర్థవంతంగా నిర్వహించి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సై కృష్ణయ్య సిబ్బంది, పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.