India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీలేరు నియోజకవర్గం కలికిరిలో ప్రధాని మోదీ సభకు వెళ్లి వస్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. కేవీపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన షేక్ జాఫర్(40), అప్జల్, వారాధి, షఫీ ఆటోలో మోదీ సభకు వెళ్లారు. తిరిగి వస్తూ సభలో ఐరన్ పైపులకు ఏర్పాటు చేసిన జెండాలు తీసుకున్నారు. వాటిని ఆటోకు కట్టారు. సభా ప్రాంగణ సమీపంలో అందులోని ఓ జెండా కరెంట్ వైర్లకు తగిలింది. జాఫర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.
తిరుపతి జిల్లాలోని 7-అసెంబ్లీ స్థానాలలో, ఇతర జిల్లా ఓటర్ల కొరకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు 9మే మధ్యాహ్నం వరకు నిర్వహించబడునని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మే 9వ తేదీన మధ్యాహ్నం వరకు తిరుపతి SVU క్యాంపస్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని కలెక్టర్ తెలిపారు.
భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మధు, భార్య శిరీషతో కలిసి బ్రతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం వచ్చి నక్కలదిన్నెలో స్థిరపడ్డారు. చిప్పిలి మేస్త్రీ నాగరాజు కుమారుడు రఘు.. శిరీషతో ఉండగా అక్కడ మహిళలు రఘును పట్టుకున్నారు. విషయం తెలిసిన భర్త మధు ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడి చేశాడు.
రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరగుతున్న నేపథ్యంలో శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సోమవారం 13వ తేదీన ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించామని స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. అయితే స్విమ్స్ అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నీరుగట్టుపల్లె చౌడేశ్వరినగర్కు చెందిన అశోక్ బాబు(34) చేనేత కార్మికుడు. అతని భార్య కువైట్కు వెళ్లింది. స్థానికంగా ఉన్న ఎరుకలరెడ్డి వద్ద అశోక్ కూలి మగ్గం నేస్తాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో అతడిని ఎరుకలరెడ్డి కొట్టారు. ఈ అవమానం తట్టుకోలేక అశోక్ నిద్రమాత్రలు మింగి చనిపోయాడు.
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందేందుకు గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి కోరారు. విదేశాల్లో పీహెచ్డీ, పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎంపికైన గిరిజన అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోపు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ www.overseas.tribal.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఇవాళ సాయంత్రం మోదీ బహిరంగ సభ జరగనుంది. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.35 గంటలకు తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కలికిరిలోని సైనిక్ స్కూల్ వద్దకు వెళ్తారు. బహిరంగ సభ అనంతరం తిరిగి సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు.
నిన్న పుంగనూరులో జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి రూ.30 వేల కోట్ల అవినీతి చేశారు. అంగళ్లు నుంచి నేను వస్తుంటే పుంగనూరులో గొడవలు చేయించాడు. 450 మందిని జైలులో పెట్టించాడు. ఆ రోజు నా గుండె రగిలిపోయింది. పెద్దిరెడ్డీ నీ కథ తేలుస్తా. మీకు నిద్రలేని రాత్రులు చూపిస్తా. నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారో మిమ్మల్నీ అంతే క్షోభ పెడతా’ అని బాబు అన్నారు.
చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ శన్మోహన్ పరిశీలించారు. పలమనేరు, నగరి, జీడి నెల్లూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, ఈవీఎం కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ సమయం దగ్గర పడుతోందని అధికారులందరూ విధులలో చురుగ్గా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూములలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ప్రధాని మోదీ బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. స్థానిక సైనిక స్కూల్ వెనుక వైపు 35 ఎకరాల మైదానంలో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.