India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓటమి తర్వాత వైసీపీ అభ్యర్థులు, నేతలు ప్రజల్లోకి రాలేదు. కొందరు ఆ పరాభవం నుంచి ఇంకా తేరుకోలేదు. జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇటీవల పుంగనూరు పర్యటన ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇవాళ జగన్ గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పెద్దిరెడ్డి హాజరవుతారా? ఓటమిపై ఏమైనా సందేశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

శ్రీ సిటీలోని ALSTOM కంపెనీలో ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిప్లమా, ఐటిఐ వెల్డర్ పూర్తిచేసి 18-22 సంవత్సరాల్లోపు యువతి, యువకులు అర్హులన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/zHku28A3SuT8a24E6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో మైనింగ్ మాఫియా నడిపారని వైసీపీ కాంట్రాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, కూడేరు రవి ఆరోపించారు. తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నా.. అక్రమ కేసులు పెట్టి తమ క్వారీలను లాక్కున్నారని మండిపడ్డారు. అమిగోస్ మినరల్స్ ద్వారా రూ.1000 కోట్ల ఖనిజం దోచేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన తమను పెద్దిరెడ్డి అనుచరులమంటూ అమిగోస్ ప్రతినిధులు బెదిరించారన్నారు.

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో రూ.1.36 కోట్ల జనరల్ ఫండ్ దుర్వినియోగం జరిగింది. ఈ విషయమై సంబంధిత అధికారులకు మెమో జారీ చేసినట్లు ఎంపీడీవో మునిరెడ్డి వెల్లడించారు. జడ్పీ సీఈవో గ్లోరియా ఆదేశాల మేరకు గతంలో పుంగనూరు ఎంపీడీవో, ఏవోగా పని చేసిన వారికి నిధుల దుర్వినియోగంపై సంజాయిషీ నోటీసులు ఇచ్చామని చెప్పారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బందితో బుధవారం సమావేశమై వారి పనితీరును సమీక్షించారు. స్థానిక పోలీసు గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. 2024 సంవత్సరంలో క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 34 కేసులు నమోదు కాగా.. అన్నింటిని ఛేదించి 83% రికవరీ రేటుతో సమర్థవంతంగా పనిచేసిన తిరుపతి క్రైమ్ పోలీసులను ప్రశంసించారు. కేసుల చేదనలో ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడి సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు SV మెడికల్ కళాశాల ఎదురుగా NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 24.

ఆటో బోల్తాపడి గాయపడ్డ విద్యార్థి మృతి చెందినట్లు ముదివేడి SI మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలంలో ఆటో బోల్తా పడిన విషయం తెలిసిందే. ముదివేడుకు చెందిన ఎస్.రఫీ కొడుకు ఎస్.జియావుల్లా(15)స్థానిక మోడల్ స్కూల్లో10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

రాష్ట్రంలో 2 MLC సీట్ల భర్తీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు వీటి కోసం పోటీ పడుతున్నారు. జనసేన కోసం తిరుపతిలో సుగుణమ్మ తన టికెట్ వదులుకున్నారు. అలాగే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు MLA బొజ్జల సుధీర్ రెడ్డి కోసం పనిచేశారు. పార్టీ కోసం కష్టపడిన ఇలాంటి వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వాళ్ల అనుచరులు కోరుతున్నారు.

ఐటీఐల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చిత్తూరు ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. మొదటి రోజు మెరిట్ ప్రకారం ఉదయం 1 నుంచి 100 వరకు, మధ్యాహ్నం 101 నుంచి 205వరకు అడ్మిషన్లు ఇస్తారు. 21న 206నుంచి 350వరకు, తర్వాత 351 నుంచి 451వరకు, 22న ఉదయం 452నుంచి 600వరకు, మధ్యాహ్నం 601నుంచి 743 వరకు ప్రవేశాలు జరుగుతాయన్నారు.

రుషికొండపై నిర్మాణాలను సమర్థిస్తూ రోజా <<13465987>>ట్వీట్ <<>>చేశారు. ఇందులోనే చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం, ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉండటంపై రోజా విమర్శలు చేశారు. దీనికి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్‌కు.. మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు’ అని భాను ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.