India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాటిమాకుల కండ్రిగ గ్రామానికి చెందిన మహేశ్ బాబు(49) పొలం వద్ద బోరు మోటార్ మరమ్మతుకు గురైంది. మెకానిక్ సాయంతో బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా చేతిలోని ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగపై పడటంతో అతను విద్యుత్ షాక్‌కు గురై కిందపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలమనేరుకు రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన గంగవరం సమీపంలోని యూనివర్సల్ మైదానానికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అనంతరం బస్సులో పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది వారి ఓటు హక్కును 5, 6వ తేదీలలో వినియోగించుకోవచ్చని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు వివరాల మేరకు.. మదనపల్లె(M) బసినికొండకు చెందిన జగదీశ్ సెలవులు కావడంతో కాటిపేరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి బంధువులకు అప్పగించారు.
మదనపల్లె మండలంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. వేంపల్లి గ్రామంలోని సతీశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన సతీశ్ నేడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విడాకులు తీసుకోవడం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
మంత్రి రోజా బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రోజా గెలిచిన తర్వాత పార్టీ నేతలను పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీ సర్వేలో ఆమె ఓడిపోతుందని తేలిందన్నారు. రోజా వల్ల నగరి కేడర్ దెబ్బతిందన్నారు.
తిరుమల శ్రీవారిని ఏప్రిల్ నెలలో దర్శించుకున్న సంఖ్యను టీటీడీ శుక్రవారం వెల్లడించింది. ఒక్క నెలలోనే శ్రీవారిని 20.17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 101.63 కోట్లు ఆదాయం వచ్చింది. 94.22 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 39.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 8.08 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
తిరుపతిలో విషాదకర ఘటన వెలుగు చూసింది. నగరంలోని తిరుమల నగర్, కృష్ణవేణి యాదవ్ కాలనీ డ్రైనేజీలో ఓ పురిటి బిడ్డ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత శిశువు పుట్టిందా లేక బిడ్డ పుట్టగానే డ్రైనేజీలో పడేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మదనపల్లెలో రెడ్ల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర నాయకులకు ఫైనాపిల్ గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. స్థానిక రెడ్డి సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థులు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఈనెల 7న తిరుపతికి రానున్నారు. అదే రోజున చంద్రగిరి నుంచి వారాహి రోడ్ షో, తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం, తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే పర్యటన పూర్తి వివరాలు ప్రకటిస్తామని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.