India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మే 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం జరగనుంది.
రేణిగుంట మండలం కురుకాలువ వద్ద ఉన్న భారతీయ పాకశాస్త్ర సంస్థ (Indian Culinary Institute)లో 2024 -25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. BB.A/MBA(Culinary Arts) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు www.icitirupati.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 25.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. గంగవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జీవరత్నం తన భార్యతో కలిసి పలమనేరు నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా పలమనేరు వైపు వస్తున్న లగేజ్ ఆటో కంచిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీవరత్నం అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పలమనేరు ఆసుపత్రికి తరలించారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం చిత్తూరుకు రానున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా వస్తున్నట్లు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
టీడీపీ, వైసీపీ శ్రేణులు బోయకొండ క్రాస్ వద్ద శనివారం రాత్రి ఘర్షణ పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. టీడీపీకి చెందిన చిట్టిబాబు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. ఈ సంఘటనలో ఇరు పార్టీ నేతలకు గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బి.కొత్తకోటలో ఆదివారం ఉదయం జరిగే రోడ్డు షోలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తంబళ్లపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రా రెడ్డి పీఏ తెలిపారు. ఉదయం 6గంటలకు మొలకలచెరువుకు, 7.30 గంటలకు పిటిఎంకు, బి.కొత్తకోటకు 8.45కు చేరుకొని బి.కొత్తకోట పట్టణంలో జరిగే రోడ్ షోలో బాలకృష్ణ పాల్గొంటారు.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నందు 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) పద్ధతిలో బి.ఎడ్ (B.Ed) ఆన్ లైన్ వెబ్ ఆప్షన్ల కోసం ఏప్రిల్ 30 తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రాంతీయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. బి.ఎడ్ (ODL) ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ వెబ్ సైట్ చూడగలరు.
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ప్రసన్నగారిపల్లె గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు జగదీష్ (15) స్కూలుకు సెలవులు కావడంతో గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరులో శనివారం నూతన న్యాయస్థాన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిజీగా ఉన్నప్పటికీ ప్రారంభోత్సవానికి రావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో బార్ అసోసియేషన్ భాగస్వామ్యాన్ని అభినందించారు.
Sorry, no posts matched your criteria.