India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆధ్వర్యంలో పాలిసెట్-2024 పరీక్ష ఈనెల 27న నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ జేమ్స్, ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరులో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కుప్పంలో 561 మంది, పలమనేరులో 1243 మంది విద్యార్థులు హాజరుకానుట్లు చెప్పారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట, కోడూరు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. వాళ్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు… రామసముద్రం మండలం పట్రాజుపల్లికి చెందిన లోకేశ్, గంజిగానిపల్లికి చెందిన సుబ్బు, శశికుమార్ బెంగుళూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు.
తిరుపతి జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, సి-విజిల్ కేంద్రాన్ని పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే గురువారం
పరిశీలించారు. అక్కడి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఎన్నికల సంబంధిత ఫిర్యాదులకు తన మొబైల్ నంబర్ 9154141876, policeobservertpt23@gmail.com ద్వారా సంప్రదించాలని సూచించారు.
టీడీపీ పుంగనూరు మాజీ ఇన్‌ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ని వాళ్లు కలిశారు. అనీషా రెడ్డి దంపతులకు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అనీషా రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ పలమనేరు MLA అభ్యర్థి అమరనాథ రెడ్డికి శ్రీనాథ్ రెడ్డి సోదరుడు అవుతారు.
చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ ర్యాలీగా వచ్చిన నాయకులు ఇద్దరు ఆర్వో కార్యాలయానికి వెళ్లే క్రమంలో కొందరు రాళ్లు విసిరారు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపు నాయకులు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు. పరిస్ధితి చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
వైద్యురాలు ఉరేసుకుని బలవన్మరణం చెందిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. CI రారాజు కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటకు చెందిన ప్రైవేటు వైద్యుడు డా.రాజేశ్‌రెడ్డితో చెన్నైకి చెందిన వైద్యురాలు అశ్విని(35)కి 8ఏళ్ల క్రితం పెళ్లైంది. అశ్విని తనగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ఇందిరా రెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తులు రూ.75.65 కోట్లు. ఆయనపై ఈ నెల 7న రొంపిచర్లలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదైంది. ఇతరత్రా కేసులు లేవు.
చంద్రగిరి నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు అభ్యర్థులు భారీ జనసమీకరణ చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాను నామినేషన్ వేసే రోజే మోహిత్ రెడ్డి నామినేషన్ వేయడం కుట్రలో భాగమని నాని ఆరోపిస్తున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయం పాటించాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ (గురువారం) నేటితో ముగియనుంది. ఇప్పటివరకు పార్లమెంట్ స్థానానికి 25మంది అభ్యర్థులు, శాసనసభ స్థానాలకు 175 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరి రోజు ఎక్కువ మంది నామినేషన్ వేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లు జిల్లా వ్యాప్తంగా RO కార్యాలయాల వద్ద మరింత భద్రతను పెంచారు.
Sorry, no posts matched your criteria.