India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్ఓల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు చేసుకున్న ఓటర్లకు సంబంధించి ఆరు వేల ఎపిక్ కార్డులు ఈ నెల 29న జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి మూడు నుంచి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా వీఎం థామస్ తమ్ముడు వీఎం నిధి నామినేషన్ వేశారు. తొలి జాబితాలోనే టీడీపీ అభ్యర్థిగా థామస్‌ను చంద్రబాబు ప్రకటించారు. ఆయనకే బీఫామ్ ఇచ్చారు. దీంతో థామస్ మంగళవారం నామినేషన్ వేశారు. మతం మారిన ఆయన నామినేషన్ చెల్లదన్న అనుమానంతో తమ్ముడి చేత నామినేషన్ వేయించారు. అలాగే మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. శాంతిపురం మండలం 121 పెద్దూరు గ్రామానికి చెందిన పార్థసారథి రెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్ పత్రాలను అందజేశారు. సంబంధిత డిపాజిట్ సొమ్మును 6.88 కిలోల బరువు ఉన్న చిల్లర నాణేలను సమర్పించారు. తనను గెలిపిస్తే కుప్పం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కుప్పం కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తానని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో బుధవారం 63 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. పార్లమెంటు స్థానానికి 8 నామినేషన్లు వేశారని చెప్పారు. పుంగునూరు అసెంబ్లీకి ఎనిమిది, నగరిలో 9, జీడీనెల్లూరులో 12, చిత్తూరులో పది, పూతలపట్టులో 5, పలమనేరులో 2, కుప్పంలో 7 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ తెలిపారు.
చిత్తూరు: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 466 మార్కులతో స్పందన రాష్ట్రస్థాయిలో 3వ స్థానం సాధించింది. ఆమెది ఉమ్మడి చిత్తూరు జిల్లా కావడం గమనార్హం. తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న యం.సురేంద్ర నాయక్ కుమార్తె స్పందన హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతోంది. ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది. స్పందనను పలువురు అభినందించారు.
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని.. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌తో కలిసి అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 26న ఉదయం 11.25కు ఉపరాష్ట్రపతి తిరుమలకు రానున్నట్టు చెప్పారు. 25న తిరుపతికి గవర్నర్ వస్తారని వెల్లడించారు.
తంబళ్లపల్లె MLA సీటుపై సస్పెన్స్ వీడింది. టీడీపీ అభ్యర్థి జయచంద్రా రెడ్డికే బీపాం అందింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆయన కలిసి బీఫామ్ అందుకున్నారు. మొదటి లిస్టులోనే జయచంద్రా రెడ్డిని TDP అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తంబళ్లపల్లె, అనపర్తి టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సీటు బీజేపీకి ఇస్తారని, టీడీపీలోనే అభ్యర్థిని మార్చుతారని ఇన్ని రోజులు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
తంబళ్లపల్లి TDPలో ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని సీట్లపై క్లారిటీ వచ్చినా తంబళ్లపల్లి విషయంలో ఇంకా పీటముడి వీడలేదు. తంబళ్లపల్లి సీటుకు తప్ప మిగిలిన అభ్యర్థులందరికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్‌లను అందజేశారు. ఇక్కడ జయచంద్రారెడ్డిని మార్చి ఆ స్థానంలో కొండా నరేంద్ర లేదా శంకర్ యాదవ్‌లకు బీఫామ్ ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది. నామినేషన్లకు ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేసే కర్ణాటకకు చెందిన ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. కర్ణాటకలో ఈ నెల 26, మే 7వ తేదీన రెండు దశలుగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు.
మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ భాష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి కోళ్ల బైలు పంచాయతీలో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఓ అభిమాని షాజహాన్ భాష చిత్రాన్ని తన ఛాతిపై వేసుకొని అభిమానాన్ని చాటుకున్నాడు.
Sorry, no posts matched your criteria.