Chittoor

News June 8, 2024

కురబలకోట: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

image

కురబలకోట రైల్వే స్టేషన్‌లో సుమారు 25 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ భాషా కథనం మేరకు.. అర్ధరాత్రి కురబలకోట రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News June 8, 2024

చిత్తూరు జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో..?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. చిత్తూరు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి రేసులో పులివర్తి నాని, గాలి బానుప్రకాశ్, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉన్నట్లు అలికిడి వినిపిస్తోంది.

News June 8, 2024

చిత్తూరు: కరెంటు షాక్ కొట్టి చిన్నారికి తీవ్రగాయాలు

image

కరెంటు షాక్ కొట్టి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగింది. రెడ్డిస్ కాలనీకి చెందిన లలిత్ ఆదిత్య (10) ఇంటి మిద్దెపై కమ్మితో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనే వెళ్తున్న విద్యుత్తు లైనుకు తగిలించాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన బాలుడిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేశారు.

News June 8, 2024

CTR: ITIలో ప్రవేశాలకు ఎల్లుండే చివరి తేదీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీతో ముగుస్తుందని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులని సూచించారు. ఆసక్తి కలిగిన వారు www.iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు తప్పనిసరిగా వెరిఫికేషన్ చేసుకోవాలని అన్నారు.

News June 8, 2024

మారిన చిత్తూరు సెంటిమెంట్

image

2009 సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయపరంగా చిత్తూరు నియోజకవర్గ సెంటిమెంట్ మారింది. 2004 వరకు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. 2009 నుంచి చిత్తూరు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంప్రదాయం వచ్చింది. అయితే 2009, 2014, 2019 అక్కడ గెలిచిన పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2024 ఎన్నికలో గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

News June 8, 2024

చిత్తూరు: 31 మండలాల్లో వర్షం

image

రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని 31 మండలాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పాలసముద్రం మండలంలో 73.4 మి.మీ., పలమనేరు 71.2, బైరెడ్డిపల్లె 67.2, గంగవరం 57.8, తవణంపల్లె 57.2, రామకుప్పం 38.2, వి.కోట 36, చిత్తూరు టౌన్ 33.4, కుప్పం 29, పూతలపట్టు 28. 6, చౌడేపల్లె 28.4, గుడుపల్లె 27.6, జీడీ నెల్లూరు 27.2, ఐరాల 26.2 మి.మీ నమోదైంది. జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

News June 8, 2024

మదనపల్లెలో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

image

యజమాని వేధింపులు భరించలేక
ట్రాక్టర్ డ్రైవర్ చీమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మదనపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. బసినికొండ పంచాయతీ, జన్మభూమి కాలనీకి చెందిన సైసావల్లి(35) నవీన్ వద్ద రూ.90 వేలు అప్పుగా తీసుకుని ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. తానిచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని యజమాని వేధింపులకు గురి చేయడంతో మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి తరలించారు.

News June 8, 2024

నగరి: నారా లోకేశ్‌ను కలిసిన గాలి భానుప్రకాశ్

image

నగరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గాలి భానుప్రకాశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఉండవల్లి నివాసంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గాలి భానుప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గాలి భానుప్రకాశ్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు వెల్లడించారు.

News June 7, 2024

చిత్తూరు: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

image

ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములకల చెరువులో జరిగింది. ఎస్సై తిప్పేస్వామి వివరాల ప్రకారం. దేవలచెరువుకు చెందిన నరేంద్ర(25) పొరుగు గ్రామానికి చెందిన మైనర్(17)తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు. వీరి మధ్య ఏం జరిగిందో ఏమో ఆ ప్రేమజంట బత్తలాపురం అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని ఎస్‌ఐ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

News June 7, 2024

రేపు ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా: ఏవీఎం

image

2024 సార్వత్రిక ఎన్నికలలో సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరాజయం చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ శనివారం సురుటుపల్లి ఆలయ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఏవీఎం బాలాజీ రెడ్డి తెలిపారు. తనతో పాటు పాలకమండలి సభ్యులు సైతం రాజీనామా చేయనున్నారని తెలిపారు. ఆలయ ఛైర్మన్‌గా పనిచేసిన పదవీకాలంలో తనకు సహకరించిన రాజకీయ ప్రతినిధులకు, ఆలయ సిబ్బందికి, అధికారులకు, ధన్యవాదాలు తెలిపారు.