India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములకల చెరువులో జరిగింది. ఎస్సై తిప్పేస్వామి వివరాల ప్రకారం. దేవలచెరువుకు చెందిన నరేంద్ర(25) పొరుగు గ్రామానికి చెందిన మైనర్(17)తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు. వీరి మధ్య ఏం జరిగిందో ఏమో ఆ ప్రేమజంట బత్తలాపురం అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని ఎస్‌ఐ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

2024 సార్వత్రిక ఎన్నికలలో సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరాజయం చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ శనివారం సురుటుపల్లి ఆలయ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఏవీఎం బాలాజీ రెడ్డి తెలిపారు. తనతో పాటు పాలకమండలి సభ్యులు సైతం రాజీనామా చేయనున్నారని తెలిపారు. ఆలయ ఛైర్మన్‌గా పనిచేసిన పదవీకాలంలో తనకు సహకరించిన రాజకీయ ప్రతినిధులకు, ఆలయ సిబ్బందికి, అధికారులకు, ధన్యవాదాలు తెలిపారు.

టీటీడీని అప్రతిష్ఠ పాలు చేసిన ఈఓ ధర్మారెడ్డికి శిక్ష తప్పదని టీడీపీ నేత వినుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో జగన్ రెడ్డి తన సామాజికవర్గ అధికారులను కీలక స్థానాల్లో నియమించారని చెప్పారు. అవినీతికి పాల్పడటానికి జగన్ ఇలా చేశారని ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులు మురళీకృష్ణ, వినుకొండ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి మిట్టపల్లి భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. కన్నబాబుకు పంపించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై వైసీపీ కార్యక్రమాలలో పాల్గొంటూ 2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు .

నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో సత్యవేడు కూటమి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ‘మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’ అంటూ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదిమూలానికి సూచించారు.

చిత్తూరు MP అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప ఒక్క నియోజకవర్గంలో కూడా ఆధిక్యం చూపలేకపోయారు. చంద్రగిరిలో1,43,841 ,నగరిలో 1,01,839, జీడీనెల్లూరులో 96, 883, చిత్తూరులో 85,414, పూతలపట్టులో 98,985, పలమనేరులో 1,20,273, కుప్పంలో 1,18,301, కుప్పంలో 1,18,301 ఓట్లు దక్కించుకున్నారు.

దాడుల నుంచి కాపాడి కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయం కమిటీలను ఏర్పాటు చేసింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్, ఆర్కే రోజా, సునీల్ కుమార్, వెంకటేగౌడ, రెడ్డెప్ప, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, విజయానందరెడ్డిని కమిటీలో నియమించింది. జిల్లాలో ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటారు.

రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు తిరుపతిలో సాదర స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ముఖేష్ కుమార్ మీనాకి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు. తిరుపతిలో విశ్రాంతి అనంతరం తిరుమలకు చేరుకొని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుపతిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ గుంతలో పడి మృతి చెందినట్లు అలిపిరి SI రామస్వామి తెలిపారు. అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద మద్యం మత్తులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ కోసం తీసిన గోతిలో పడ్డాడు. ఎవరు చూడకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రుయాలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

తిరుపతి వినాయక నగర్లో దొంగలు చొరబడి షకీల ఇంట్లో 46 గ్రాముల బంగారం, రూ.80 వేల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. వినాయక నగర్లో ఉండే షకీల బుధవారం రాత్రి పనిపై తాళం వేసుకొని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు తలుపులు పగల గొట్టి చోరీ చేయడాన్ని గురువారం గుర్తించింది. ఫిర్యాదుపై స్పందించి క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.