India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జాతర నిర్వహణపై కలెక్టర్ షన్మోహన్ కీలక సూచనలు చేశారు. మే 10 లోపు లేదా మే 15 తర్వాత గంగ జాతరలు చేసుకోవాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. జాతర నిర్వహణకు పోలీస్ స్టేషన్ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయరాదని సూచించారు.
సీఎం జగన్‌పై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందోనన్న భయం టీడీపీలో మొదలైందని.. అందుకే చంద్రబాబు తన మీద తానే రాళ్లు వేయించుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. సింపతీతో ప్రజలు ఓట్లు వేయరని ఆ ఘటన నిరూపించింది. సీఎం జగన్‌పై దాడి విషయంలో చంద్రబాబు, లోకేశ్ నీచంగా మాట్లాడుతున్నారు’ అని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
నగరి నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లుడు, పుత్తూరు పట్టణ 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ జాన్ కెనడీ టీడీపీ గూటికి చేరారు. ఆయనకు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెనడీతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీని వీడారు. కోనేటి ఆదిమూలం కూడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరడం విశేషం.
సౌండ్ ఎక్కువ ఉన్న ప్రచార వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. సోమవారం ఆర్వోలు , ఏఆర్ఓలు , నోడల్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇంటింటి ప్రచారాలపై ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలపై అధికారులు పరిశీలించాలన్నారు.
రామచంద్రాపురం మండలంలోని 23 పంచాయతీల పరిధిలో 130 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో ప్రత్యూషకు అందజేశారు. ప్రతిపక్షాలు తమపై ఆరోపణలు చేయడం బాధించాయని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కుప్పం మండలం మహమ్మద్ పురం పంచాయతీ గణేష్ పురానికి చెందిన వైసీపీ వార్డు సభ్యుడు పళణి సోమవారం టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే గంట గడవకముందే మళ్లీ చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకుని సొంత గూటికి చేరారు.
రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడిన ఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రామసముద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సొంత పనిమీద పుంగనూరుకు బైకులో వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గమధ్యంలోని కుదురుచీమనపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి బాధితుల్ని 108లో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంబళ్లపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది. ఎస్సై శివ కుమార్ కథనం.. కురబలకోట మండలం, గొడ్డిన్లవారిపల్లికి చెందిన మంజునాథ్ తన భార్య సుజాతతో గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది, తంబళ్లపల్లి మండలం, కుక్కరాజుపల్లి సమీపంలోని కుమ్మరపల్లి వద్ద ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చిత్తూరు జిల్లా శ్రీరంగరాజుపురం(SRపురం) మండలంలో విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన హిమాచల మందడి తన గానుగ షెడ్ వద్దకు వెళ్లాడు. అక్కడ సెలఫోనుకు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ కుళ్లాయప్ప కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిత్తూరు(D) గంగవరం మండలానికి చెందిన యువతి B.tech సెకండ్ ఇయర్ చదువుతోంది. బైరెడ్డిపల్లెకు చెందిన అజయ్ తన స్నేహితుడి ద్వారా ఆమెతో వాట్సాప్ చేశాడు. ఆ చాట్ విషయాలు బయటపెడతానని బెదిరించి అమ్మాయిని ముళబాగల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ యువతితో కొన్ని వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ కావడంతో వీడియోలను వారి బంధువులకు పంపాడు. యువతి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పోలీసులు అజయ్‌ను అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.