India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. బాపట్లకు చెందిన ఆయన ఐఆర్ఎస్ ఉద్యోగిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. నాన్ లోకల్ అయిన ఆయన లోకల్‌గా ఉన్న వైసీపీ అభ్యర్థి రెడ్డప్పని 2.20 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇకపై ఆయన జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని దగ్గుమళ్ల అనుచరులు చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీ చేసిన 12 మందికి డిపాజిట్ గల్లంతైంది. చంద్రబాబు 48, 184 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబుకు 1,20,925 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి భరత్ 73, 586 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల గోవిందరాజులు 2,562 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. నోటాకు 2,111 ఓట్లు వచ్చాయి.

రాష్ట్రంలో వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. జిల్లాలకు జిల్లాలనే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క పెద్దిరెడ్డి ఫ్యామిలీ కారణంగా రెండు జిల్లాల్లో వైసీపీకి క్లీన్ స్వీప్ బాధ తప్పింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి విజయం సాధించారు. మరోవైపు రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు గెలిచారు.

వరుసగా రెండుసార్లు గెలిచిన చెవిరెడ్డికి ఈసారి ఫలితాలు నిర్ఘాంతపోయేలా చేశాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఆయనతో పాటు కుమారుడు మోహిత్ రెడ్డి ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నారు. చంద్రగిరిలో మోహిత్ రెడ్డి పులివర్తి నానిపై 43,852 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. అటు ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి టీడీపీ అభ్యర్థి మాగుంట చేతిలో 48,911 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

సత్యవేడు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి ఆదిమూలం సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థిపై 2,650 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఫామ్ అందజేశారు. ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన టిడిపిలో చేరారు.

టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నుండి 47వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా బాబు విజయంపై టిడిపి నేతలు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టిడిపి కుప్పం ఇంచార్జ్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా. సురేష్ తదితరులు కుప్పం ఆర్వో శ్రీనివాసులు వద్ద డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.

➤కుప్పం:చంద్రబాబు ➤పలమనేరు: అమరనాథ రెడ్డి
➤పూతలపట్టు: మురళీ ➤చిత్తూరు: జగన్మోహన్
➤GDనెల్లూరు: థామస్ ➤నగరి: గాలి భానుప్రకాశ్
➤సత్యవేడు: ఆదిమూలం ➤శ్రీకాళహస్తి: బొజ్జల
➤తిరుపతి: శ్రీనివాసులు ➤చంద్రగిరి: పులివర్తి నాని
➤పీలేరు: నల్లారి కిశోర్ ➤పుంగనూరు: పెద్దిరెడ్డి
➤మదనపల్లె:షాజహాన్➤తంబళ్లపల్లె:ద్వారకనాథరెడ్డి
NOTE: పుంగనూరు, తంబళ్లపల్లోనే వైసీపీ గెలిచింది.

చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆయన ఆధిక్యం చూపారు. తన సమీప ప్రత్యర్థి ఎన్.రెడ్డప్ప మీద 1.80 లక్షల మెజార్టీతో గెలుపు దుందుభి మోగించారు. ఈక్రమంలో ఆయన జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.

తిరుపతి పార్లమెంట్ కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. తొలుత వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడ్డారు. తర్వాత ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ వరప్రసాద్ వరప్రసాద్‌తో హోరాహోరీ తలపడ్డారు. చివరకు గురుమూర్తికి 6,32,228 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి వరప్రసాద్ రావు 6,17,659 ఓట్లు సాధించారు. ఈక్రమంలో గురుమూర్తి 14,569 ఓట్లతో గట్టెక్కారు. ఉప ఎన్నికలో ఆయన 2,30,572 ఓట్లతో గెలవడం విశేషం.

వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వెంటనే తన రిజైన్ ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన టీటీడీ ఈవోకు లేఖ రాశారు. వైవీ సుబ్బారెడ్డి తర్వాత గత ఆగస్టు నెలలలో ఆయన ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.