Chittoor

News April 13, 2024

అమ్మవారి సేవలో హర్యానా గవర్నర్

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏవిఎస్వో సతీష్ కుమార్, ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News April 13, 2024

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ 

image

ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు రావడం, ఆదివారం తమిళ ఉగాది కావడంతో శనివారం తిరుమలలో భక్తల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు  భక్తులు తిరుమలకు వస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. సర్వ దర్శనానికి 20 గంటలు సమయం పడుతుందన్నారు.  

News April 13, 2024

19న మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్

image

పుంగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ కార్యాలయం శనివారం తెలిపింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News April 13, 2024

ఎన్నికల నిర్వహణలో సెక్టర్ ఆఫీసర్ల పాత్ర కీలకం: జేసీ

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టర్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియోజకవర్గ పరిధిలోని సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లకు శనివారం నగర పాలక కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు.

News April 13, 2024

చిత్తూరు: పవన్ కళ్యాణ్ పై మిథున్ రెడ్డి విమర్శలు

image

భీమవరం, గాజువాకలో ఓడిపోవడంతో పిఠాపురంలో పవన్ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి అక్కడ వంగాగీత బలమైన నేత అని, ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసు తీసుకోని బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో వంగాగీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

News April 13, 2024

TPT: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా రీసెర్చ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి. పిజి డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ/ ఫార్మసిటికల్ సైన్స్/ ఎంటెక్ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22.

News April 13, 2024

తిరుపతి: గ్రీన్ ఛానల్ ద్వారా హార్ట్‌, లివర్‌ తరలింపు

image

తాను మరణించినా అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. తమ వాళ్లు మరణించినా అంత దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్‌. శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నుండి గుండె, లివర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అనంతరం అక్కడ నుండి పోలీసుల భద్రత నడుమ ప్రత్యేక ఆంబులెన్స్ లలో గుండెను శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు.

News April 13, 2024

మదనపల్లె: భార్యపై భర్త బండ రాయితో దాడి..

image

పండుగ సరుకులు కొనివ్వడానికి రాలేదని నిలదీసిన భార్య పై భర్త బండరాయితో దాడి చేసిన ఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం.. మండలంలోని గారబురుజుకు చెందిన శివకుమార్ మదనపల్లెలో మగ్గాలు నేస్తాడు. శుక్రవారం రాత్రి గారబురుజును శివకుమార్‌ వచ్చాడు. ఉగాది పండుగకు ఇంట్లోకి సరుకులు కొనివ్వడానికి ఎందుకు రాలేదని భార్య దీపిక నిలదిసింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్యపై బండరాయితో దాడిచేసి గాయపరిచాడు.

News April 13, 2024

తిరుపతి: పోస్టల్ బ్యాలెట్ కు 22న ఆఖరు

image

ఎన్నికల విధుల్లోని ఉద్యోగులతోపాటు అత్యవసర సేవలు అందిస్తున్న విభాగాలకు చెందిన వారు వచ్చే ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్‌ని వాడుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిబంధనల మేరకు 18ఏ ప్రకారం ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్ అధికారికి 12డీ ఫారం అందజేయాలన్నారు.

News April 13, 2024

తిరుపతిలో సర్దుకున్న కూటమి నాయకులు

image

తిరుపతి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించినప్పటి నుంచి నెలకొన్న వివాదం ముగిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో వారు అలకతీరి శనివారం నుంచి ప్రచారం చేయనున్నారు. సుగుణమ్మ, కిరణ్ రాయల్ తో వ్యక్తిగతంగా మాట్లాడిన పవన్ వారికి భరోసా కల్పించారు. బీజేపీ నాయకులు సమావేశం కాకుండా వెళ్లి పోయారు.

error: Content is protected !!